పదేళ్లుగా రష్మీ పరిశ్రమలో ఉన్నప్పటికీ రాని అవకాశాలు ఒక్క షో తో వెల్లువలా వచ్చాయి. అదే అడల్ట్ కామెడీ షో జబర్దస్త్. ఆ కార్యక్రమం తర్వాత హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసిన ఈ భామ.. జబర్దస్త్ పై ప్రేమతో ఎక్స్ పోజింగ్ ఎక్కువగా చేస్తోంది. ప్రతి ఎపిసోడ్ లో క్లీవేజ్ షోలతో యువకుల మతులు పోగొడుతోంది. పొట్టి డ్రస్సులతో టీవీకి అతుక్కుపోయేలా చేస్తోంది. కుటుంబం మొత్తం కలిసి కూర్చొని చూసే ఈ షోలో ఇలాంటి బట్టలతో యాంకరింగ్ చేయొచ్చా? అని ఆమెను రీసెంట్ గా ప్రశ్నిస్తే అదిరిపోయే సమాధానం ఇచ్చింది.
” హీరోయిన్ లు బికినీ లు వేసి అందాలు ఆరబోస్తే తప్పు లేదు కానీ మేము మిడ్డీ లు చడ్డీలు వేసుకుంటే తప్పా?” అంటూ ఎదురు ప్రశించింది. హీరోయిన్ లు ఎక్స్ పోజింగ్ చేస్తే గుడ్లప్పగించి మరీ చూస్తున్నారు అదే మేము చేస్తే విమర్శలు చేస్తున్నారు ఏంటి ? అంటూ విరుచుకుపడింది. దీంతో ఏమి చెప్పాలో తెలియక సదరు విలేఖరికి దిమ్మదిరిగి మైండ్ బ్లాక్ అయింది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.