మరో ఇద్దరు స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ కొట్టేసింది

  • August 2, 2019 / 07:10 PM IST

నాగ శౌర్య హీరోగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘ఛలో’. ఈ చిత్రం ద్వారా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన కన్నడ బ్యూటీ రష్మిక. మొదటి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ అందుకున్న రష్మిక ఆ తరువాత విజయ్ దేవరకొండ, పరుశురాం కాంబినేషన్లో వచ్చిన ‘గీతగోవిందం’ చిత్రంలో ఛాన్స్ అందుకుంది. ఆ చిత్రమైతే ఏకంగా డబుల్ బ్లాక్ బస్టర్ అవ్వడంతో ‘దేవదాసు’ ‘డియర్ కామ్రేడ్’ చిత్రాల్లో ఛాన్స్ అందుకుంది. ఇప్పుడైతే ఏకంగా మహేష్ బాబు సినిమాలోనే హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది.

టాలీవుడ్ లో ఈమెను ‘గోల్డెన్ లెగ్’ అంటుంటారు. అందువలనే మహేష్ సినిమాలో ఛాన్స్ దొరికింది. ఇక అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రంలో కూడా రష్మిక నే హీరోయిన్ గా ఎంచుకుంటున్నారని టాక్ వినిపిస్తుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కబోతుందని సమాచారం. ఈ రెండు చిత్రాలతో పాటు నితిన్ ‘భీష్మ’ లో కూడా నటిస్తూ బిజీగా గడుపుతుంది ఈ బ్యూటీ. ఇక కోలీవుడ్లో కూడా కార్తీ హీరోగా తెరకెక్కనున్న చిత్రంలో కూడా రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ‘ఇళయ దళపతి’ విజయ్ తదుపరి చిత్రంలో కూడా రష్మిక పేరు పరిశీలనలో ఉందట. అదికూడా కన్ఫార్మ్ అయితే ఈమె స్టార్ హీరోయిన్ అయిపోయినట్టే అనడంలో సందేహం లేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus