తనపైన వస్తున్న రూమర్స్ పైన మరొకసారి క్లారిటీగా చెప్పేసిన రష్మిక

  • November 29, 2018 / 04:20 AM IST

‘ఛలో’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన కన్నడ బ్యూటీ రష్మిక. ఈ భామ తక్కువ సినిమాలే చేసినప్పటికీ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘గీత గోవిందం’ సినిమా సూపర్ సక్సస్ అవ్వడంతో ఈ భామకి అవకాశాలు మరిన్ని పెరిగాయి. ప్రస్తుతం తెలుగులో విజయ్ దేవరకొండ సరసన ‘డియర్ కామ్రేడ్’ సినిమాలో,. హీరో నితిన్ తో కలసి ఒక సినిమాలో నటిస్తుంది. ఇక ఈమె తమిళంలో మంచి క్రేజ్ ఉన్న హీరో సరసన నటిస్తుందంటూ రూమర్స్ గతంలో రాగ ఆ సినిమాలో నటించట్లేదు అంటున్న కూడా మళ్ళీ రూమర్స్ రావడంతో రష్మిక మరోసారి వాటిపైన స్పదించింది.

‘సర్కార్’ సినిమా మంచి విజయం సాధించగా హీరో విజయ్ నెక్స్ట్ అట్లీ దర్శకత్వంలో నటించనున్నాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక కన్ఫర్మ్ అయిందంటూ గతంలో వార్తలు రావడంతో నా అంచనాలు పెంచకండిరా అంటూ ఫన్నీ గా రిప్లై ఇచ్చింది. కానీ ఇప్పుడు మళ్ళీ అదే రూమర్ బయటికి రావడంతో విజయ్ సార్, అట్లీ సార్ సినిమాలో నేను నటుస్తున్నానా అని చాలామంది అడుగుతున్నారు, ఈసారికి అది కుదరలేదు, ఫ్యూచర్ లో వారితో కలసి పనిచేసే అవకాశం దొరుకుతుందని ఆశిస్తున్నాను. మీరు నామీద చూపిస్తున్న ప్రేమకి చాలా థాంక్స్, త్వరలోనే తమిళ్ సినిమాలో తప్పకుండ ఎంట్రీ ఇస్తాను అంటూ క్లారిటీగా చెప్పేసింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus