Rashmika: విజయ్ అతనిలా ఇన్సెక్యూర్ కాదు.. మాజీ ప్రియుడి పై రష్మిక షాకింగ్ కామెంట్స్..!

విజయ్ దేవరకొండ, రష్మిక మధ్యలో ఏముంది? ఈ విషయం పై జనాల మైండ్లో ఓ క్లారిటీ. విజయ్- రష్మిక లకు ఇంకా క్లారిటీ ఉంది. కానీ అది ఎప్పుడు బహిరంగం అవుతుంది అనేది పెద్ద ప్రశ్న. ఇప్పటివరకు జరుగుతున్న ప్రచారం ప్రకారం.. విజయ్ దేవరకొండ- రష్మిక ప్రేమలో ఉన్నారు అని అంతా అనుకుంటున్నారు అంతే..! ఈ విషయం పై రష్మిక.. ఓ నేషనల్ మీడియాతో ఎప్పుడో క్లారిటీ ఇచ్చిందట..! మరి ఇది స్ట్రింగ్ ఆపరేషన్లో భాగంగా జరిగిందా.. ఏంటా? అన్నది తెలీదు కాదు.

రష్మిక అయితే విజయ్ గురించి ఈ విధంగా స్పందించిందట. ‘రక్షిత్‌ శెట్టితో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిన తర్వాత నేను చాలా బాధలో ఉన్నాను. అప్పుడు విజయ్‌ దేవరకొండ నాకు ఎంతో ఓదార్పునిచ్చాడు. కేర్‌ చూపించాడు. అతను ఇచ్చిన మోరల్ సపోర్ట్ వల్లనే ఈరోజు నేను ఈ విధంగా ఉన్నాను. నా కోసం ప్రపంచం ఎదురుచూస్తోందని అతనే తెలిపాడు. తన ప్రపంచంలో విజయ్ చాలా సింపుల్‌గా, హంబుల్ గా జీవిస్తాడు. ‘గీత గోవిందం’ టైంలో మా మధ్య కేవలం స్నేహం మాత్రమే ఉండేది.

కానీ, విజయ్‌పై నాకు ఏదో తెలియని భావన.విజయ్ చాలా స్పెషల్ అని నా మనసు చెబుతుండేది. ‘డియర్‌ కామ్రెడ్‌’ షూటింగ్‌ టైంలో విజయ్‌ని ప్రేమిస్తున్నానని అర్థం అయ్యింది. ఆ టైంలో నేను అతనికి చెప్పేశాను. మొదట విజయ్ వద్దన్నాడు… తర్వాత ఓకె చెప్పాడు. రక్షిత్‌ లాగా విజయ్‌ కు ఇన్‌సెక్యూరిటీ లేదు. చాలా ఫ్రీ మైండెడ్‌. నేను పెళ్లి తర్వాత హ్యాపీగా సినిమాలు చేసుకోవచ్చు అని చెప్పాడు’ అంటూ చెప్పిందట.

పైకి విజయ్ – రష్మిక స్నేహితులమని చెబుతారు. కానీ ప్రైవేట్ గా టూర్లు వేస్తుంటారని కూడా వినికిడి. ఈ మధ్యనే మాల్దీవ్స్ కు వెళ్లి వచ్చారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అంతేకాదు ‘లైగర్’ సినిమా రిలీజ్ కాకుండానే రష్మిక సగం చూసింది అని విజయ్ ఓ సందర్భంలో చెప్పాడు. అలాగే ‘లైగర్’ ప్లాప్ అయినా తనకు బాగా నచ్చిన సినిమా అని రష్మిక కూడా ఇటీవల తెలిపింది.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus