సరిలేరు కొత్త పోస్టర్స్ లో ఎట్టకేలకు దర్శనమిచ్చిన రష్మిక

  • December 12, 2019 / 12:25 PM IST

“సరిలేరు నీకెవ్వరు” టీజర్ విడుదలైనప్పట్నుంచి సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ తో సహా అందరిదీ ఒకటే క్వశ్చన్ “హీరోయిన్ ఎక్కడ?”. ఆఖరికి మొన్నటివరకూ విడుదలైన రెండు పాటల్లో కూడా హీరోయిన్ ని ఎక్కడా కనీసం చూపించలేదు. దాంతో స్పెషల్ టీజర్ లేదా పోస్టర్ ఏమైనా రిలీజ్ చేస్తున్నారేమో అనుకున్నారు జనాలు. కట్ చేస్తే.. ఇవాళ తెల్లవారుఝామున రష్మిక-మహేష్ బాబు కాంబినేషన్ పోస్టర్స్ నెట్ లో ప్రత్యక్షమయ్యాయి.

పాపం ఏదైనా ట్రెండ్ క్రియేట్ చేసుకుందాం అనుకున్న రష్మిక ఫ్యాన్స్ షాక్ అయ్యారు. కాకపోతే.. పోనీలే ఇప్పటికైనా సినిమా హీరోయిన్ ఉందని గుర్తుచేశారు అని సంతోషపడ్డారు. నిన్నమొన్నటివరకూ మహేష్ పక్కన రష్మిక ఎలా ఉంటుందో అని భయపడినవాళ్ళందరూ.. ఇప్పుడు ఇద్దరు పెయిర్ చూసి “బాగున్నారు” అనుకొంటున్నారు. కానీ ఈమధ్యకాలంలో మహేశ్ సరసన సరితూగిన ఏకైక కథానాయిక మాత్రం కీయారా అద్వానీ. మహేశ్ పక్కన కీయారా సెట్ అయినట్లుగా మరెవరూ సెట్ కాలేదు.

24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ అండ్ లైక్స్ సాధించిన లిరికల్ సాంగ్స్ ఇవే!
30 సౌత్ ఇండియన్ హీరోయిన్లు మరియు వారి చైల్డ్ హుడ్ పిక్స్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus