హీరో రవితేజ నటిస్తున్న కొత్త సినిమా టైటిల్ లోగో వాయిదా

  • November 12, 2018 / 11:15 AM IST

హీరో రవితేజ, ఇలియానా జంటగా శ్రీనువైట్ల దర్శకత్వంలో వస్తున్న ‘అమర్ అక్బర్ ఆంటోని’ సినిమా అన్ని హంగులు పూర్తిచేసుకొని రిలీజ్ కి దగ్గరలో ఉంది. ప్రస్తుతం రవితేజ ఈ సినిమా ప్రమోషన్స్ తో చాలా బిజీగా ఉన్నాడు. ఇక హీరో రవితేజ తను నటించబోయే తదుపరి చిత్రం కూడా కన్ఫర్మ్ అయినట్లుగా తెలుస్తుంది. అయితే రవితేజ తన నెక్స్ట్ సినిమాకి సంబంధించిన టైటిల్ లోగో ని మొదటగా ఈ నెల 13 న రిలీజ్ చేయాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉండగా, ప్రస్తుతం రవితేజ ‘అమర్ అక్బర్ ఆంటోని’ మూవీ ప్రమోషన్స్ తో బిజీగా ఉండటం, ఆ సినిమా రిలీజ్ కి దగ్గరలో ఉండటం వలన 13 వ తేదీన రిలీజ్ చేద్దాం అనుకున్న టైటిల్ లోగో రిలీజ్ ని చిత్ర యూనిట్ వాయిదా వేసుకున్నారట.

ఇక ‘అమర్ అక్బర్ ఆంటోని’ రిలీజ్ అయిన తరువాతే ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ లోగో రిలీజ్ ప్లాన్ చేయనున్నట్లు సమాచారం. అయితే రవితేజ హీరోగా, నాభా నటేశ్ మరియు పాయల్ రాజ్ పుత్ కథానాయికలు గా నటించనున్న ఈ సినిమాకి వీఐ ఆనంద్ దర్శకత్వం వహించనున్నారు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి అన్ని అనుకున్న సమయానికి పూర్తిచేసుకొని డిసెంబర్ లో సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది అని సమాచారం. మరి రవితేజ నటించబోయే తదుపరి సినిమా టైటిల్ ఎలా ఉంటుందో, ఎలాంటి సినిమాలో నటిస్తున్నారనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే మరి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus