అమెరికాలో మొదలు కానున్న శ్రీను వైట్ల, రవితేజ మూవీ

Advertisement

పరుగెత్తే ఓపిక ఉంటే నడవడమెందుకు.. అనే ఓ మంచి మాటని ఫాలో అవుతుంటారు రవితేజ. బెంగాల్ టైగర్ సినిమా ఆ తర్వాత కుటుంబం కోసం కొంత విశ్రాంతి తీసుకున్నారు కానీ.. రెస్ట్ అనే మాటే అతనికి నచ్చదు. అందుకే రాజా ది గ్రేట్ సినిమా హిట్ తర్వాత ఒక రోజు కూడా విశ్రాంతి తీసుకోకుండా “టచ్ చేసి చూడు” సినిమాని కంప్లీట్ చేశారు. ఈ చిత్రం ఫలితాన్ని చూసుకుంటూ కూర్చోకుండా.. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో మూవీని మొదలెట్టారు. “నేల టికెట్” అనే పేరు పరిశీలిస్తున్న సినిమా షూటింగ్ ప్రస్తుతం వైజాగ్ లో జరుగుతోంది. అలీ, రవితేజ మధ్య కొన్ని కామెడీ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మరో వారం రోజుల పాటు వైజాక్ లోనే సినిమా షూట్ చేయనున్నారు. దీంతో మొదటి షెడ్యూల్ పూర్తి అవుతుంది.

చిత్ర బృందం మొత్తం పదిహేను రోజులు పాటు బ్రేక్ తీసుకోనున్నారు. ఆ సమయంలో రవితేజ కొత్త సినిమా పనుల్లో బిజీ కానున్నారు. తన టీమ్ ని అమెరికాకి పంపించనున్నారు. శ్రీను వైట్ల దర్శకత్వంలో రవితేజ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. “అమర్ అక్బర్ ఆంటోని ” అనే టైటిల్ ఫిక్స్ చేసిన ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 19వ తేదీ నుంచి అమెరికాలో ప్రారంభంకానుంది. రవితేజ లేని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను షూట్ చేయనున్నారు. తర్వాత ఏప్రిల్ నుంచి ఈ మూవీ షూటింగ్ లో రవితేజ జాయిన్ కానున్నారు. తమన్ సంగీతం అందించనున్న ఈ సినిమాపై శ్రీనువైట్ల ఆశలు పెట్టుకున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus