ఎన్నో ఏళ్ల కృషి తరువాత హీరోగా నిలదొక్కుకున్న హీరో మాస్ మహారాజా రవితేజ. అయితే దాదాపు 10ఏళ్లు ఇండస్ట్రీని ఒక ఊపు ఊపాడు రవితేజ. అయితే అంతవరకూ బాగానే ఉంది. కానీ అనుకోని విధంగా వరుస ఫ్లాప్స్ తో కరియర్ గాడి తప్పడంతో ఎన్నో ప్రయత్నాల తరువాత ‘బలుపు’ సినిమాతో మళ్ళీ హిట్ ట్ర్యాక్ లోకి వచ్చాడు అని అందరూ అనుకున్నారు. కానీ ఆ ఆనందం పెద్దగా నిలవలేదు.
తరువాత ఆ హిట్ ట్రాక్ ను కంటిన్యూ చెయ్యకపోవడంతో రవి కరియర్ పూర్తి డైలమాలో పడింది. ఇక మరో పక్క బెంగాల్ టైగర్ ఒకే అనిపించినా ఆ సినిమా తరువాత రవి ఇప్పటివరకూ ఒక్క సినిమా కూడా సైన్ చెయ్యలేదు. అప్పట్లో నిర్మాత డీవీవీ దానయ్య రవితేజాతో ఒక సినిమాను ఎనౌన్స్ చేయబోతున్నాడని వార్తలు వచ్చాయి. దీనితో ఈ సినిమాలో అయినా తమ అభిమాన హీరో నటిస్తాడని మాస్ మహారాజా అభిమానులు భావించారు.
ఈ వార్తలు కూడ గాలి వార్తలుగా తేలిపోవడంతో ఉసూరు మన్నారు అభిమానులందరూ. అయితే టాలీవుడ్ లో వినిపిస్తున్న మ్యాటర్ ప్రకారం రవితేజా తన న్యూ లుక్ కోసం ‘న్యూలుక్ రీజువినేషన్ థెరపీ’ కోసం కొన్నిరోజులపాటు రవితేజ ఫారెన్‌కి వెళ్తున్నట్లు టాక్. అక్కడి రిసార్ట్స్‌లో థెరపీ ట్రీట్‌మెంట్ తీసుకుని స్లిమ్ గా మారడానికి రవితేజా విదేశాలు వెళుతున్నట్లు టాక్. మరి ఏది ఎంతవరకూ నిజమో తెలీదు కానీ మొత్తానికైతే రవితేజ కరియర్ మళ్ళీ గాడి తప్పింది అనే తెలుస్తుంది. మరి కనీసం ఈ రీజువినేషన్ థెరపీ తర్వాత అయినా మాస్ మహారాజా అభిమానులను అలరించే సినిమాలు తీస్తాడని ఆశిద్దాం.