ఆ సినిమా ఆగిపోలేదు, పోస్ట్ పోన్ అయ్యిందంతే!

  • July 17, 2018 / 11:23 AM IST

నిన్నట్నుంచి “రవితేజ సినిమా ఆగిపోయింది” అనే వార్త హల్ చల్ చేస్తోంది. ఆల్రెడీ మైత్రీ మూవీస్ బేనర్ లో “అమర్ అక్బర్ ఆంటోనీ”లో నటిస్తున్న రవితేజ అదే సమయంలో మొదలెట్టిన తమిళ చిత్రం “తేరీ” రీమేక్ ను పక్కన పెట్టాడని, దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ రెడీ చేసిన తెలుగు వెర్షన్ నచ్చని మైత్రీ సంస్థ ఆ సినిమాను మొత్తానికి అటకెక్కించ్చిందని సదరు గాసిప్పుల సారాంశం;. అయితే.. ఈ విషయమై మైత్రీ సంస్థ ప్రొడక్షన్ మెంబర్స్ ని అడగగా.. “ఆ సినిమా ఆపేయాలన్న ఆలోచన ఎవరికీ లేదు, ఒక షెడ్యూల్ షూటింగ్ కూడా జరిగింది. అయితే.. రవితేజ ఒకేసారి రెండు సినిమాలు చేయడం ఇబ్బందిగా ఉండడంతో “తేరీ” రీమేక్ ను కొన్నాళ్లపాటు పక్కన పెట్టిన విషయం వాస్తవమే కాదు.. ఆ సినిమాను ఆపేసామని వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదు” అని స్పష్టం చేశారు.

రవితేజ సరసన కేతరీన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి మొదలవుతుందట. ఆల్రెడీ డేట్స్ సెట్ అయ్యాయని ఈలోపు లొకేషన్స్, సెట్స్ ఫైనల్ చేసుకొనే పనిలో దర్శకుల టీం ఉందని తెలుస్తోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus