చిత్రం,నువ్వు నేను, జయం చిత్రాల దర్శకుడు తేజ కెరీర్ అంతంత మాత్రంగా ఉంది. ఈ మధ్య కాలంలో ఆయన చేసిన ప్రతి సినిమా ఫ్లాప్ టాక్ ను తెచ్చుకుంది. దీంతో ఎలా అయినా.. హిట్ కొట్టాలనే ప్రయత్నంలో రాజశేఖర్ ను విలన్ గా పరిచయం చేస్తూ.. ‘అహం’ అనే సినిమాను డైరెక్ట్ చేయడానికి నిర్ణయం తీసుకున్నాడనే వార్తలు వచ్చాయి.
అయితే ఇప్పడు రాజశేఖర్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. తేజ కావాలనే రాజశేఖర్ ను తప్పించాడో.. లేక వారిద్దరి మధ్య ఎలాంటి గొడవలు జరిగాయో తెలియదు కానీ.. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లో మరో స్టార్ హీరో నటిస్తున్నట్లు సమాచారం. దర్శకుడు తేజ.. మాస్ మహారాజా రవితేజను కలిసి ఈ సినిమా కథ వినిపించాడట. రవితేజ కూడా దీనికి ఓకే చెప్పినట్లు టాక్. ఉగాది రోజు ఈ సినిమాపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది.