అక్షయ్ కుమార్ టైటిల్ తో రవితేజ సినిమా!

  • September 2, 2016 / 05:59 AM IST

ఇటీవల “రుస్తుం”తో సూపర్ హిట్ అందుకొన్న బాలీవుడ్ కథానాయకుడు అక్షయ్ కుమార్ తన తదుపరి చిత్రంగా “క్రాక్” అనే చిత్రాన్ని ఎనౌన్స్ చేయడంతోపాటు సదరు టైటిల్ ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే. మరి మన మాస్ మహారాజా రవితేజ ఆ టైటిల్ నచ్చిందో లేక తన మునుపటి సూపర్ హిట్ చిత్రం “కిక్”లా డిఫరెంట్ గా ఉందనుకొన్నాడో తెలియదు కానీ తన తాజా చిత్రానికి “క్రాక్” అనే టైటిల్ ను ఎరికోరి ఎంపిక చేసుకొన్నాడని తెలుస్తోంది. ఇటీవల టాలీవుడ్ ఫిల్మ్ ఛాంబర్ లో “క్రాక్” అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించారు. ఇది రవితేజ సినిమా కోసమే అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
బాబీ దర్శకత్వంలో రూపొందే సినిమా కోసం ఈ టైటిల్ ను సెలెక్ట్ చేశారని కొందరు చెప్పుకుంటుంటే.. జంట దర్శకులతో రవితేజ చేయనున్న సినిమా కోసమని మరికొందరు అనుకుంటున్నారు. త్వరలోనే ఈ విషయంపై క్లారీటీ వచ్చే అవకాశం ఉంది. “బెంగాల్ టైగర్” సినిమా తరువాత రవితేజ ఇప్పటివరకు మరో సినిమా పట్టాలెక్కించలేదు. ఆయన సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు!!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus