సినీ రంగంలో స్టార్స్ కి కొన్ని రకాల సెంటిమెంట్లు ఉంటాయి. ఫలానా అక్షరంతో సినిమా పేరు పెట్టాలి.. ఆ లొకేషన్లో సినిమా షూట్ చేయాలి.. ఆ తేదీన విడుదల చేయాలి.. ఇలా ఒక్కొక్కరిది ఒక్కో సెంటిమెంట్. తాజాగా రవితేజకి ఓ సెంటిమెంట్ తోడయింది. అది ఏమిటంటే .. పవన్, ఎన్టీఆర్ లు నో చెప్పిన కథ చేస్తే రవితేజకి హిట్టేనని సినీ పండితులు చెబుతున్నారు. ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ కోసం పూరి జగన్నాథ్ రాసుకున్న కథలు “ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి” సినిమాలను రవితేజ చేశాడు. ఈ సినిమాలు అతని కెరీర్ ని మలుపు తిప్పాయి.
పవన్ నో చెప్పిన తర్వాతే ఇవి రవితేజతో చేశానని పూరి జగన్నాధ్ అప్పుడు స్పషం చేశారు. అలాగే బోయపాటి శ్రీను చేసిన ‘భద్ర’ చిత్రానికి ముందు ఎన్టీఆర్ నే అనుకున్నారు. కానీ ఎన్టీఆర్ బిజీగా ఉండటంతో ఆ సినిమా రవితేజకి వచ్చింది. ఇప్పుడు “రాజా ది గ్రేట్” స్టోరీ ని కూడా అనిల్ రావిపూడి ఎన్టీఆర్ కిమొదట వినిపించారు. తారక్ నో చెప్పడంతో అది మాస్ మహారాజ్ వద్దకు వెళ్ళింది. మళ్ళీ హిట్ వరించింది. సో ఎన్టీఆర్, పవన్ నో చెప్పిన స్టోరీలు రవితేజకి కలిసివస్తున్నాయని అందరూ ఫిక్స్ అయిపోయారు.