మాస్ మహారాజ్ రవితేజ సినిమాలంటే మాస్ అభిమానులకు పెద్ద పండుగ. ఎంతో హుషారుగా రవితేజ స్టెప్పులు, ఫైట్లు చేస్తుంటే ఫుల్ గా ఎంజాయ్ చేసేవారు. వారి కోసమే ఆయన ఏడాదికి రెండు మూడు సినిమాలతో వచ్చేవారు. కానీ గత ఏడాదిలో రవితేజ చిత్రం ఒక్కటి కూడా విడుదల కాలేదు. కనీసం మొదలు కూడా కాలేదు. దీంతో నిరాశలో ఉన్న అభిమానులకు శుభవార్త. ఈ సారి మాస్ మహారాజ ఏకంగా రెండు చిత్రాలు చేయనున్నట్లు తెలిసింది. కొంతకాలంగా ప్రపంచ టూర్ లో ఉన్న రవితేజ ఈ నెలలో హైదరాబాద్ కి చేరుకోనున్నారు. పటాస్, సుప్రీం చిత్రాలను డైరక్ట్ చేసిన అనిల్ రావిపూడి తో కలిసి స్క్రిప్ట్ వర్క్ లో భాగం పంచుకోనున్నారు. ఈ చిత్రాన్ని మార్చి నుంచి సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి రవితేజ ఉత్సాహంగా ఉన్నారని సమాచారం.
ఈ కథ రవితేజకు తగ్గట్టు యాక్షన్, కామెడీ మిళితం అయి ఉంటుందని టాక్. దీంతో హ్యాట్రిక్ కొట్టాలని అనిల్ రావిపూడి చూస్తున్నారు. ఈ చిత్రం తర్వాత రవితేజ చేయనున్న సినిమా కథను కూడా ఇప్పుడే ఫిక్స్ చేసినట్లు ఆయన సన్నిహితులు వెల్లడించారు. ఆ చిత్రం ఆగస్టు నుంచి షూటింగ్ జరుపుకోనుంది. సో ఈ ఏడాది రవితేజ రెండు చిత్రాలతో హంగామా చేయనున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.