రవితేజ హీరోగా విక్రమ్ సిరి దర్శకత్వంలో ‘టచ్ చేసి చూడు’

  • January 25, 2017 / 11:56 AM IST

‘మాస్ మహారాజా’ రవితేజ హీరోగా ‘టచ్ చేసి చూడు’ పేరుతో ఓ భారీ చిత్రం రూపొందనుంది.బేబీ భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), వల్లభనేని వంశీ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. విక్రమ్ సిరికొండ దర్శకునిగా పరిచయవుతున్నారు .జనవరి 26 (గురువారం) రవితేజ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా వివరాలను దర్శక నిర్మాతలు అధికారికంగా వెల్లడించారు.

నిర్మాతలు నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), వల్లభనేని వంశీ మాట్లాడుతూ – “మాకు చిరకాల మిత్రుడైన రవితేజ తో ఈ సినిమా నిర్మిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మాస్ మహారాజా ఇమేజ్ కి తగ్గట్టుగా ప్రముఖ రచయిత వక్కంతం వంశీ అద్భుతమైన కథను తయారు చేసారు. ఫిబ్రవరి మొదటి వారంలో చిత్రీకరణ మొదలు పెడుతున్నాం.” అని తెలిపారు.

దర్శకుడు విక్రమ్ సిరికొండ మాట్లాడుతూ – “ఇదొక డిఫరెంట్ యాక్షన్ ఎంటర్ టైనర్.ఇందులో ఇద్దరు కథానాయకులుంటారు. ఇప్పటికే రాశి ఖన్నాను ఎంపిక చేసాం. మరొక నాయికను త్వరలోనే ప్రకటిస్తాం.హేమాహేమీలైన సాంకేతిక బృందం ఈ చిత్రానికి పనిచేస్తున్నారు” అని చెప్పారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus