అల్లు అర్జున్ భయానికి కారణాలు ఏంటి ?

  • July 28, 2018 / 07:10 PM IST

విజయం వెన్నంటే ఉండే కొండత ఉత్సాహం ఉంటుంది. అదే అపజయం వెంటాడుతుంటే భయాలు చుట్టుముడుతాయి. ప్రస్తుతం రెండో పరిస్థితిలో ఉన్నారు అల్లు అర్జున్. సినిమాకి సినిమాకి లుక్ మార్చుకుంటూ.. నటన, డ్యాన్స్ లతో ఆకట్టుకుంటూ టాలీవుడ్ టాప్ హీరోల లిస్ట్ లో ముందు వరుసలో నిలిచారు. దీంతో ఎంతో హుషారుగా ఉండే బన్నీ డల్ అయిపోయారు. అందుకు కారణం వరుసగా రెండు అపజయాలు. స్టైలిష్ స్టార్ చేసిన దువ్వాడ జగన్నాథం ఫరవాలేదనిపించినా… వక్కంతం వంశీ దర్శకత్వంలో నటించిన నా పేరు సూర్య మాత్రం పూర్తిగా నిరాశపరిచింది.

దీని తర్వాత ఏ కథ తీసుకోవాలి.. ఏ డైరక్టర్ తో సినిమా చేయాలా? అని కన్ఫ్యూజన్ లో ఉన్నారు. తమిళ డైరక్టర్ లింగుస్వామి, విక్రమ్ కె కుమార్, శేఖర్ కమ్ముల వంటి వారు మంచి కథలు చెప్పినప్పటికీ.. అది తనకి వర్కౌట్ అవుతుందా?.. హిట్ అవుతుందా? అనే అనుమానాలతో ఓకే చెప్పలేకపోతున్నారు. ఇప్పటికే రామ్ చరణ్ బన్నీని అధిగమించడం.. ప్రభాస్ రికార్డు నెలకొల్పడం.. ఎన్టీఆర్ వరుసగా హిట్స్ అందుకోవడం వంటి అంశాలు బన్నీని మరింత ఒత్తిడిలో పడేస్తున్నాయి. ఈ సారి హిట్ అందుకోకపోతే మరింత వెనక్కి వెళ్లిపోయే ప్రమాదం ఉంది. అందుకే తన కొత్త సినిమా సెలక్షన్స్ ఆలస్యమవుతోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus