ఆనందంలో అనుష్క….కారణం??

  • July 13, 2016 / 10:08 AM IST

ఒకప్పుడు అంటే హీరోయిన్స్ కు ముఖ్యమైన పాత్రలు పడేవి. ఇప్పుడు ఏముంది, స్కిన్ షో కి తప్ప హీరోయిన్స్ ని ఎందుకు ఉపయోగపడకుండా చేస్తున్నారు దర్శకులు. అయితే అలాంటి క్రమంలో కూడా అందాల భామ అనుష్కకి కాలం కలసి వచ్చింది. అంతులేని ఆనందంతో ఊగిపోతుంది…ఇంతకీ విషయం ఏమిటంటే….బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ రబ్ నే బనదీ జోడీ తో అరంగేట్రం చేసి దాదాపుగా బడా హీరోలతో వరుస హిట్స్ కొట్టేసింది. తాజాగా విడుదలయిన సల్మాన్ ఖాన్ సుల్తాన్ లో ఈ భామ నటన అద్భుతం అనే చెప్పాలి.

ఈ సినిమాలో సుల్తాన్ భార్యగా , మొదట లవర్ గా అతను రెజ్లర్ అవ్వడానికి ముఖ్యకారణం అయిన పాత్రలో అనుష్క యాక్టింగ్ సూపర్ అనే చెప్పాలి. అంతేకాకండ క్లైమాక్స్ లో హాస్పిటల్ సీన్ , రింగ్ సీన్ లో అనుష్క నటించిన తీరుకు బాలీవుడ్ మొత్తం సూపర్ అంటూ పొగిడేస్తుంది. అదే క్రమంలో ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధించడానికి, వసూళ్ల పరంగా దూసుకుపోవడానికి అటు సల్మాన్ ఖాన్, దర్శకుడె కాకుండా అనుష్క శర్మ కూడా ప్రధాన కారణం అని ఒప్పుకుని తీరాల్సిందే.

ఇదిలా ఉంటే ఈ సినిమా 300కోట్ల క్లబ్ లో చేరడం ఖాయం అనే అనిపిస్తుంది. అదే క్రమంలో ఇప్పటికే అనుష్క ఖాతాలో పీకే సినిమా సైతం 300కోట్ల క్లబ్ లో చేరిన సినిమాగా ఉంది. అయితే పీకే తరవాత అనుష్క శర్మ ఫార్మ్ ని తీవ్రంగా కోల్పోయింది.  దిల్ ధడక్ నే దో – బాంబే వెల్వెట్ లాంటి సినిమాలు ఫ్లాప్ కావడంతో ఆమె పరిస్థితి ఇబ్బందుల్లో పడింది. అయితే మళ్లీ వరుస హిట్స్ వాస్తు ఉండడంతో అనుష్క ఆనందంతో ఊగిపోతుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus