భాగమతి తర్వాత ఒకే సినిమాకి ఓకే చెప్పిన అనుష్క.!

బాహుబలి సినిమాలో దేవసేనగా అనుష్క దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమా తర్వాత భాషాభేదం లేకుండా అనేక సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారని అనుకున్నారు. అయితే భాగమతి మాత్రమే చేశారు. స్వీటీ ఏడాది పాటి కస్టపడి చేసిన భాగమతి సినిమా కలక్షన్ల వర్షం కురిపించింది. దీని తర్వాత అయినా వేగం పెంచుతారనుకుంటే కూల్ గా ఒకే ఒక్క సినిమాకి ఒకే చెప్పారు. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో  సినిమా చేయడానికి మాత్రమే ఆమె అంగీకరించారు.. తమిళంతో పాటు తెలుగులోను ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.

మరి ఇంత క్రేజ్ పెట్టుకొని ఏడాదికి ఒక సినిమానే అనుష్క ఎందుకు ఒప్పుకుంటోందని ఆరా తీస్తే అసలు విషయం తెలిసింది. బాహుబలి సినిమాలో బాహుబలి తల్లిగా కనిపించడానికి కొంత బరువు పెరగాల్సి వచ్చిందంట. అది కూడా ఎక్కువ రోజులు బరువుని కొనసాగించడంతో.. ఆ బరువు అలాగే కొనసాగుతోంది. తగ్గడానికి శరీరం మొండికేస్తుంది. దీంతో సినిమాలను కొన్ని రోజులు పక్కన పెట్టి పూర్వం అందాన్ని సొంతం చేసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. బరువు తగ్గే వరకూ వేరే సినిమాలను ఒప్పుకునే ఉద్దేశంతో ఆమె లేదని సన్నిహితులు అంటున్నారు. నాజూగ్గా మారి గ్లామర్ రోల్స్ లో మళ్ళీ అనుష్క మనల్ని మెప్పించనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus