ప్రముఖ తమిళ డైరక్టర్ మణిరత్నం ఎంతోమందిని స్టార్స్ గా చేశారు. అతని దర్శకత్వంలో నటించిన రజనీకాంత్, మమ్ముట్టి, ప్రకాష్ రాజ్, మోహన్ లాల్, నాగార్జున వంటి ఎంతోమంది మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగే అరవింద స్వామితో పాటు, మాధవన్(సఖి), ప్రసన్న, నిరోష, బేబి షామిలి.. తదిరతరులను వెండితెరకి పరిచయం చేశారు. నటీనటులతో పాటు ఏ.ఆర్.రెహమాన్ ని కూడా మణిరత్నం సంగీత దర్శకుడిగా రోజా సినిమాతో పరిచయం చేశారు. అందుకే అతని దర్శకత్వంలో పనిచేయాలని చాలామంది కలలుకంటుంటారు. అలాగే అలనాటి నటి జీవిత కూడా కలలు కంటోంది.
అయితే అది తన కోసం కాదు.. తన కుమార్తెలకోసం. రీసెంట్ గా జరిగిన “నవాబ్” ఈవెంట్ లో మణిరత్నంతో కలిసి జీవిత కనిపించేసరికి అదే ప్రయత్నంలోనే ఉందని అర్ధమయింది. జీవిత పెద్ద కుమార్తె శివానీ అడవి శేష్ తో కలిసి సినిమా చేస్తోంది. ఇక రెండో కూతురు శివాత్మిక హీరోయిన్ గా పరిచయం కావడానికి సిద్ధమవుతోంది. ఆమెను వెండితెరకు పరిచయం చేయమని మణిరత్నం ని జీవిత కోరినట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పుకుంటున్నారు. జీవిత కోరికని మన్నించి మణిరత్నం అవకాశం ఇస్తే శివాత్మిక తప్పకుండా మంచి నటిగా పేరు తెచుకుంటుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.