‘ఖైదీ నెంబర్‌ 150’ ప్రచారానికి కాజల్ రాని వెనుక కారణం అదే !!!

  • January 16, 2017 / 11:01 AM IST

చిత్ర విజయంలో ప్రచారం కీలకం అవుతోంది. అందుకే ఇందుకోసం వారం నుంచి నెల రోజుల పాటు ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ప్రత్యేకంగా సమయాన్ని కేటాయిస్తున్నారు. మీడియా వారికీ ఇంటర్వ్యూ లు ఇచ్చి సినిమా గురించి వివరిస్తున్నారు. సంక్రాంతికి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి 150 వ చిత్రం ఖైదీ నంబర్ 150 మూవీ కి కూడా ప్రచారం బాగానే చేశారు. చిరు తో పాటు డైరక్టర్ వి.వి.వినాయక్, నిర్మాత రామ్ చరణ్ తేజ్ మూవీ ప్రమోషన్లో పాల్గొన్నారు. అయితే ఇందులో సోలో హీరోయిన్ గా నటించిన కాజల్ అగర్వాల్ మాత్రం పబ్లిసిటీకి దూరంగా ఉంది. కారణం ఏమిటని ఆరా తీయగా అసలు విషయం బయట పడింది.

తనను తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయం చేసిన డైరక్టర్ తేజ సినిమా కోసం టాలీవుడ్ యువరాణి ఖైదీ ప్రచారంలో పాల్గొనలేదని తెలిసింది. చిరు చిత్రంలో నటించేందుకు కాజల్ ఓ మూవీ కోసం కేటాయించిన డేట్స్ క్యాన్సల్ చేసుకుంది. అందుకే  ప్రమోషన్స్ నుంచి ఆమెకు నిర్మాత చరణ్ రిలీఫ్  ఇచ్చినట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పుకుంటున్నారు. కాజల్ అగర్వాల్ “ఖైదీ” విజయాన్ని సైతం ఆస్వాదించకుండా జనవరి 11 నుంచి రానా హీరోగా తేజ తెరకెక్కిస్తున్న “నేనే రాజు, నేనే మంత్రి” చిత్రం షూటింగ్ లో పాల్గొంటోంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus