ఒక హీరో ఇలా అయిదు ఏళ్ల పాటు ఒక సినిమాకు కష్టపడి దీర్ఘకాలంగా పని చెయ్యడం ఇప్పటివరకూ టాలీవుడ్ చరిత్రలో ఎక్కడ చూడలేదని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇంతకీ ఎవరు ఆ హీరో అంటే మీకు ఇప్పటికే మ్యాటర్ అర్ధం అయిపోయి ఉండాలి….నిజమే మనం మాట్లాడుకునేది బహుబలి గురించే, అయితే బాహుబలి కధ అయిపోయింది. సినిమా సూపర్ హిట్, 1000కోట్లకు పైగా వసూళ్లు, ఇక నెక్స్ట్ ఏంటి ప్రభాస్ అంటే, బాహుబలి పూర్తయిన వెంటనే తర్వాత యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై రన్ రాజా రన్ దర్శకుడు సుజిత్ డైరెక్షన్ లో ‘సాహో’ షూటింగ్ మొదలు పెట్టాలి అనుకున్నాడు మన డార్లింగ్. కానీ ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను కాస్త వాయిదా వేసి జులై నుంచి ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు అని టాలీవుడ్ సర్కిల్స్ నుంచి వస్తున్న న్యూస్, కారణం ఏంటి అంటే, బాహుబలి-2 సినిమా ప్రభాస్ చాలాకాలం పాటు గడ్డంతోనే కనిపించాడు మన యంగ్ రెబెల్ స్టార్, అదే క్రమంలో అమరేంద్ర బాహుబలిగా ధీరోదాత్తమైన లుక్ లో కనిపించేందుకు అదే గెటప్ మెయిన్ టెయిన్ చేశాడు.
అయితే ఇప్పుడు సాహో సినిమా మొత్తం ప్రభాస్ మోడ్రన్ యంగ్ లుక్ తో కనిపించనున్నాడట. ఈ కొత్త లుక్ కోసమే యాభై రోజుల పాటు షూటింగ్ లకు విరామం ప్రకటించి యూఎస్ వెళ్లాడు. అక్కడి బ్యూటీ సెలూన్స్ల్ లో లేటెస్ట్ అండ్ అల్ట్రా మోడరన్ ఫేషియల్స్ చేయించుకుని మరింత హ్యాండ్ సమ్ గా కనిపించేందుకు ప్రిపేర్ అవుతున్నాడు. మొత్తంగా మన అమరేంద్ర బాహుబలి మళ్లీ మన డార్లింగ్ గా మారిపోయి, అమ్మాయిల కలల రారాజుగా సాహోతో చెలరేగిపోనున్నాడు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.