అనిరుధ్ కి తప్పని సుచీ కష్టాలు

  • February 24, 2018 / 01:46 PM IST

ఒక్కోసారి పరాజయాలే కాదు, మనిషి మీద పుట్టుకొచ్చే రూమర్స్ కూడా అతడి కెరీర్ ని నాశనం చేస్తుంటాయి. ఇటీవల కాలంలో ‘వేలైక్కారన్, తాన సీన్ధ్ర కొట్టం’ లాంటి సూపర్ హిట్ చార్ట్ బస్టర్స్ ఇచ్చిన అనిరుధ్ కి ప్రస్తుతం తమిళంలో సరైన ఆఫర్లు లేవు. ఇక తెలుగులో అయితే.. “అజ్ణాతవాసి” అనంతరం బిజీ అయిపోదామని ప్లాన్ చేసినా.. ఆ సినిమా సూపర్ ఫ్లాప్ అవ్వడంతో తెలుగులో ఆల్మోస్ట్ మనోడి అడ్రెస్ గల్లంతయినట్లే. ఇక తమిళంలోనేమో తాను రీసెంట్ హిట్ ఇచ్చిన సూర్య మొదలుకొని తనను మొదటి నుండి ఎంకరేజ్ చేస్తూ వస్తున్న ధనుష్ కూడా ఇప్పుడు ఉన్నట్లుండి అనిరుధ్ ను పక్కనేట్టాడు.

గత కొంతకాలంగా ధనుష్ తన సినిమాల కోసం అనిరుధ్ ను తీసుకోవడం మానేశాడు. “విఐ.పి 2” నుంచి ఈ గోల మొదలైంది. అలాగే.. వరుసబెట్టి శివ-అజిత్ సినిమాలకు సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్న అనిరుధ్ ను తొలగించి తాజా చిత్రం “విశ్వాసం” కోసం డి.ఇమాన్ ను ఫైనల్ చేశారు. దీనికంతటికీ కారణం సుచీ లీక్స్ సమయంలో బయటపడ్డ అనిరుధ్ ఫోటోలు, వీడియోలేనని తెలుస్తోంది. అందుకే తమిళ స్టార్ హీరోలందరూ అనిరుధ్ ని ఎవాయిడ్ చేస్తున్నారు. మరి ఈ ఎవాయిడింగ్ నుంచి అనిరుధ్ ఎంత త్వరగా బయటపడతాడో చూడాలి. ఎందుకంటే.. ఈ విధంగా అనిరుధ్ ను ఇంకొందరు హీరోలు ఎవాయిడ్ చేస్తే ఇక మనోడు దుకాణం సర్ధుకోవాల్సిందే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus