మెహ్రిన్ కావాలనే ఆ సినిమా నుండి తప్పుకుందా?

  • November 27, 2018 / 10:27 AM IST

‘కృష్ణగాడి వీర ప్రేమగాధ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచమైన ముద్దుగుమ్మ మెహ్రిన్. మొదటిసినిమాతోనే మంచి నటన కనబరిచిన ఈ భామ అందరి దృష్టిని ఆకర్షించింది. కానీ ఈ భామకి ఆఫర్స్ అనేవి అంతగా రాకపోవడంతో కొంత గ్యాప్ తీసుకొని మళ్ళీ ‘మహానుభావుడు’, ‘రాజా ధీ గ్రేట్’ వంటి సినిమాలతో ఫార్మ్ లోకి రాగా ఆ తరువాత చేసిన సినిమాలు నిరాశనే మిగిల్చాయి. ఇక ఈ అమ్మడు ఇటీవలే ఒక సినిమా ఒప్పుకొని అడ్వాన్స్ తీసుకొని మళ్ళీ సినిమాలో నటించను అని ఇచ్చిన అడ్వాన్స్ వెనక్కి ఇచ్చే పనిలో ఉందంటూ గుస గుసలు వినిపిస్తున్నాయి.

పులి వాసు దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా చేస్తున్న సినిమాకి మెహ్రిన్ నో చెప్పినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ముందుగా హీరో సుధీర్ బాబు తో ఈ సినిమా ఉంటుందని చెప్పినపుడు మెహ్రిన్ సినిమా చేయడానికి ఒకే చెప్పి కొంత అడ్వాన్స్ కూడా తీసుకుందంటా, కానీ ఏవో కారణాల వల్ల హీరో సుధీర్ బాబు ఈ సినిమా నుండి తప్పుకోవడం మెగాస్టార్ చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ కన్ఫర్మ్ అవ్వడంతో ఈ భామ సినిమాకి నో చెప్పేసి అడ్వాన్స్ కూడా తిరిగి ఇచ్చేస్తుందనే వార్తా ఫిలిం నగర్ లో చెక్కర్లు కొడుతుంది. మరి హీరో మారడం వలనే నో చెప్పిందా లేదా వేరే పెద్ద సినిమా ఆఫర్ ఏమైనా వరించిందో తెలియట్లే అంటున్నారు సినీ జనాలు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus