టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజా చిత్రం జనతా గ్యారేజ్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం ఫర్స్ట్ లుక్ మొదలుకుని ట్రైలర్ వరకూ ఎక్కడా తగ్గకుండా సినిమాను ప్రమోట్ చేసుకుంటూ వెళ్తున్నాడు దర్శకుడు కొరటాల శివ. అయితే అదే క్రమంలో ఈ చిత్రం యొక్క ఆడియో కూడా సూపర్ హిట్ అవడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి అనే చెప్పాలి. ఇదిలా ఉంటే ఈ సినిమా మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అదే క్రమంలో ఈ సినిమాలో ఆయన పాత్ర కీలకం అయ్యిన పాత్ర అని ట్రైలర్ లో చూస్తే అర్ధం అయిపోతుంది. ఆయితే ఇప్పుడు చిక్కు అల్లా ఆ పాత్రదె అన్న టాక్ ఒకటి బలంగా వినిపిస్తుంది.
ఇంతకీ విషయం ఏమిటంటే…తొలుత ఈ సినిమాలో తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకోవాలని డిసైడ్ అయ్యారు మోహన్ లాల్. ఇందుకోసం స్పెషల్ కోచింగ్ కూడా తీసుకున్నారు. అయితే తాజాగా విడుదలయిన ట్రైలర్ లో మాత్రం ఆయన స్వరం వినిపించలేదు…ఈ మధ్యనే విడుదలయిన మనమంతా చిత్రానికి సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్న ఈ సూపర్ స్టార్, జనతా గ్యారేజ్ విషయంలో వెనక్కి తగ్గారు. దానికి గల కారణాలు ఏమిటి అంటే…తన తెలుగు యాస.. పాత్ర స్వభావాన్ని- ఆ రోల్ లో ఉన్న ఇంటెన్సిటీని క్యారీ చేయలేకపోతోందని భావించారట ఈ మలయాళ స్టార్.
అందుకే తెలుగు వెర్షన్ డబ్బింగ్ కి దూరంగా ఉన్నారని తెలుస్తోంది. నెలలపాటు కష్టపడి ప్రత్యేకంగా కోచింగ్ తీసుకున్నా.. తన తెలుగు మాడ్యులేషన్ పర్ఫెక్ట్ గా లేదని మోహన్ లాల్ నిర్ణయించుకోవడమే.. ఇప్పుడు జనతా గ్యారేజ్ లో ఆయన గొంతు వినిపించకపోవడానికి కారణం. ఏది ఏమైనా…మళయాళ సూపర్ స్టార్ అయినప్పటికీ తన డబ్బింగ్ వల్ల సినిమాకు ఇబ్బంది కలగకూడదు అని మోహన్ లాల్ అలా చేయడంతో అందరూ ఆయన్ని తెగ పొగిడేస్తున్నారు.