‘త్రివిక్రమ్’పై ఒత్తిడి తెస్తున్న పవన్ ఎందుకంటే?

  • August 27, 2017 / 08:23 AM IST

పవర్ స్టార్ అంటే టాలీవుడ్ లో పరిచయం లేని పేరు. అయితే దాదాపుగా వరుస ఫ్లాప్స్ తో డీలా పడ్డ పవన్ కి జల్సా తో మంచి హిట్ ఇచ్చి మళ్లీ పవన్ రేంజ్ ని అలా పైకి తీసుకెళ్ళాడు మన త్రివిక్రమ్. అయితే అలాంటి త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ హ్యాట్రిక్ హిట్ కోసం పని చేస్తున్నాడు. అయితే ఈ సినిమా భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కుతున్న తరుణంలో ఈ సినిమా విషయంలో పవన్ కాస్త ఒత్తిడికి లోనాయీ త్రివిక్రమ్ కి కాస్త ఒత్తిడి పెంచుతున్నాడట. అయితే పవన్ ఎందుకు అలా చేస్తున్నాడు కారణం ఏంటి అంటే…ఒకసారి మీరే చదవండి మీకే అర్ధం అవుతుంది…అసలు మ్యాటర్ లోకి వెళితే, ప్రస్తుతం త్రివిక్రమ్ పవన్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే.

అయితే ఈసినిమాకు సంబంధించి ఇంకా రెండు ఫారిన్ షెడ్యూళ్లు ఉండగా…ఒకదాని తరువాత ఒకటి ఈరెండు షెడ్యూల్స్ కలిపి 60 రోజుల షూటింగ్ కలిగి ఉండగా, పవన్ మాత్రం ఈ విదేశీ షెడ్యూలు తగ్గించి ప్రస్తుతం ఎక్కువగా హైదరాబాద్ లోనే షూటింగ్ చేయమని త్రివిక్రమ్ ను కోరినట్లు టాక్. అయితే దానికి కారణం లేకపోలేదు, ప్రస్తుతం పవన్ అటు సినిమాలే కాదు, ఇటు పొలిటికల్ గా కూడా తన సత్తా ఛాటాలీ అని అనుకుంటున్న క్రమంలో లోకల్ లో ఉంటే తన జనసేన కార్యక్రమాలకి హాజరు కావచ్చు అన్న ఆలోచనలో ఈ ఒత్తిడి తెస్తున్నట్లు టాక్. మరి ఈ విషయంలో ఎలాంటి రిసల్ట్ ఉంటుందో చూడాలి.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus