జెర్సీ సినిమా కోసం మలయాళీ భామే కావాలంటున్న నాని

  • September 20, 2018 / 09:38 AM IST

మన నేచురల్ స్టార్ నానికి కేరళ అంటే ఇష్టమో లేక కేరళ అమ్మాయిలంటే ఏమైనా స్పెషల్ ఇంట్రెస్ట్ ఉందో తెలియదు కానీ.. కెరీర్ తొలినాళ్ళ నుంచి ఇప్పటివరకూ నాని పరిచయం చేసిన లేదా నటించిన కేరళ అదే మల్లు భామల లిస్ట్ చాలా పెద్దది. నిత్యామీనన్, నివేదా థామస్, అను ఎమ్మాన్యుల్, అనుపమ పరమేశ్వరన్, సాయి పల్లవి, శరణ్య వంటి భామలందరూ మలయాళీ ముద్దుగుమ్మలే కావడం విశేషం. ఇప్పుడు ఈ లిస్ట్ లో మరో మల్లు భామ జాయిన్ అవ్వనుంది. మలయాళంలో ఒక రెండు సినిమాల్లో నటించి నటిగా ఇప్పుడిప్పుడే మంచి గుర్తింపు తెచ్చుకొంటున్న రెబా జాన్ అనే బొద్దుగుమ్మను కథానాయికగా ఎంపిక చేసుకొన్నాడట నాని.

“మళ్ళీ రావా” ఫేమ్ గౌతమ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న “జెర్సీ” చిత్రంలో నాని ఓ మధ్య వయస్కుడైన క్రికెటర్ గా నటిస్తున్నాడు. అందుకే మరీ యంగ్ గా కాకుండా కాస్త పెద్దగా కనిపించే రెబా జాన్ ను ఫైనల్ చేశారట. ఈ చిత్రంలో మరో కథానాయికకు కూడా అవకాశం ఉంది. ప్రస్తుతం ఆమె కోసం వెతుకులాటలో ఉన్నారు దర్శకబృందం. ఇకపోతే.. ‘దేవదాస్” రిలీజ్ & బిగ్ బాస్ సీజన్ 2 ఫినిష్ చేసిన తర్వాత నాని “జెర్సీ”కి షూట్ స్టార్ట్ చేయనున్నాడు. అనిరుధ్ సంగీత సారధ్యం వహించనున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్నారు. ఈ సినిమాపై నాని చాలా ఆశలు పెట్టుకొన్నాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus