పాపం రెజీనాకు అదృష్టం కలిసిరావడం లేదో లేక మరింకేదైనా రీజనో తెలియదు కానీ.. అందం, అభినయంతోపాటు ఆ అందాన్ని చాలా అద్భుతమైన రీతిలో ఆరబోయగల సత్తా, తెగువ ఉన్నప్పటికీ.. అమ్మడికి మంచి కమర్షియల్ హిట్ దొరికి దాదాపు నాలుగేళ్లవుతోంది. అందువల్ల అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లుగా అగ్ర కథానాయిక చేరువదాకా వచ్చి కూడా ఆమడ దూరంలో ఆగిపోయింది.
ఇక తెలుగులో సరైన అవకాశాలు రాకపోతుండడంతో మళ్ళీ తమిళంలో అవకాశాలు దక్కించుకొని అక్కడికి వెళ్ళినా పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. ఇక రీసెంట్ గా “మిస్టర్ చంద్రమౌళి” అనే చిత్రంలో బికినీలతో, లిప్ లాక్ లతో రచ్చ చేసినప్పటికీ.. ఇవాళ విడుదలైన ఆ చిత్రంలో కంటెంట్ లేకపోవడంతో రిజల్ట్ ఫ్లాప్ అని డిక్లేర్ చేశారు. దాంతో.. బికినీతో బరితెగించినా సరైన అవకాశాలు రావడం లేదని బాధపడుతూ.. నెక్స్ట్ సినిమా కోసం అర్రలు చాస్తోంది. మరి రెజీనా ఆశలు నెరవేరాలంటే మంచి హిట్ పడాల్సిందే.