స్టార్ హీరోయిన్ పేరు కోసం హద్దు మీరి అందాలు ప్రదర్శించిన రెజీనా

  • May 3, 2018 / 11:17 AM IST

టాలీవుడ్ లో రెజీనా.. పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, జ్యో అచ్యుతానంద వంటి విజయాలు అందుకుంది. తెలుగులోనే కాకుండా తమిళంలో అవకాశాలు పట్టేసింది. అయితే మంచి కమర్షియల్ సినిమాల్లో భాగం కానందుకు తెగ బాధపడుతోంది. క్రియేటివ్ డైరక్టర్ కృష్ణ వంశీ దర్శకత్వంలో నక్షత్రం సినిమాలోను నటించినప్పటికీ గుర్తింపు రాలేదు. అందుకే కోలీవుడ్ లోకి వెళ్ళింది. అక్కడ హీట్ పుట్టిస్తేనైనా ఇక్కడ అవకాశాలు అందుకోవచ్చని ప్లాన్ వేసింది. కసరత్తు చేసింది. ఫిట్ బాడీని సొంతం చేసుకుంది. తిరు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చంద్రమౌళిలో హద్దు మీరు అందాలు ఆరబోసింది.

బికినీ వేసుకొని సముద్రతీరంలో యువతకి పిచ్చెక్కింది. ఈ పాటని రీసెంట్ గా చూసిన రెజీనా.. తిరుని మెచ్చుకుంటోంది. తనని వల్గర్ గా కాకుండా గ్లామర్ గా చూపించడంలో టీమ్ సక్సస్ అయిందని అభినందించింది. ఆ బీచ్ సాంగ్ కి సంబంధించిన ఫోటోలు నెట్లో హల్ చల్ చేస్తున్నాయి. ఈ దెబ్బతో కోలీవుడ్ లో మరిన్ని అవకాశాలు అందుకోవడం గ్యారంటీ అని సినీవిశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కార్తీక్, గౌతమ్ కార్తిక్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus