టాలీవుడ్ లో అందాల ఆరబోతకే అవకాశాలు ఎక్కువ. అయితే ఈ విషయాన్ని గమనించిన రాశిఖన్న, రకుల్ ప్రీత్ లు వారి సోయగాల పరిమలాలలో అందరినీ ముంచి తేల్చుతూ దూసుకుపోతుంటే, వారితో పాటే కరియర్ స్టార్ చేసిన రేజీనా మాత్రం అవకాశాలు లేక ఈగలు కొట్టుకుంటుంది. అదే క్రమంలో ఆమె అప్పట్లో సాయి ధర్మ తేజ తో నటించిన సినిమాలు వరుసగా హిట్ అయినప్పటికీ సాయికి మంచి బ్రేక్ వచ్చినా, ఆమెకు మాత్రం అవకాశాలు దక్కడంలేదు. ఇక టాలీవుడ్ ను నమ్ముకుంటే పని అవ్వదు అనుకుందో ఏమో కానీ, ఆమె కన్ను ఇప్పుడు కోలీవుడ్ పై పడింది.
అయితే అవకాశాల మాట పక్కన పెడితే…ఎప్పుడూ ఈమెపై ఇండస్ట్రీలో ఏదో ఒక గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి…ఈమధ్య ఒక ప్రముఖ ఇంగ్లీష్ దిన పత్రికకు ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడిన తీరు లేనిపోని అనుమానాలను రేకెత్తిస్తున్నాయి…ఆ ఇంటర్వ్యూ చేసిన మీడియా ప్రతినిధి ఇప్పటికీ సాయి ధరమ్ తేజ్ తో సాన్నిహిత్యం కొనసాగిస్తున్నారా ? అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ తాను ప్రస్తుతం ఈ మెగా యంగ్ హీరోతో ఎటువంటి సన్నిహిత సంబంధాలు పెట్టుకోవడం లేదు అని అంటూ పరోక్షంగా కొన్ని సెటైర్లు వేసింది. అంతటితో ఆగకుండా తన సినిమా కెరియర్ లో తనను ఏ బాయ్ ఫ్రెండ్ పక్కన పడేయ లేకపోయాడని అయితే తనకు నచ్చక తానే అనేక మంది బాయ్ ఫ్రెండ్స్ ను పక్కన పడేసానని సంచలన వ్యాఖ్యలు చేసింది.
అయితే ఈ కామెంట్స్ అన్నీ సాయి ధర్మ తేజ, మరియు సందీప్ కిషన్ గురించే అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. అదే క్రమంలో తాను పక్కన పడేసిన మాజీ బాయ్ ఫ్రిండ్స్ తో ఇంకా తాను మాట్లాడుతూనే ఉన్నాను అని మరో ట్వీష్ట్ ఇచ్చింది. ఇలా నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ అవకాశాలు రాకపోయినా, వార్తల్లో నిలుస్తుంది ఈ అమ్మడు.