థ్రిల్లర్ సినిమా కోసం సైకాలజీ స్టూడెంట్ గా రేజీనా!

  • September 15, 2018 / 01:42 PM IST

సినిమాల్లోకి రావడానికి ముందు.. హీరోయిన్ రెజీనా చెన్నైలో సైకాలజీలో డిగ్రీ కంప్లీట్ చేసిందట. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తన నెక్ట్స్ సినిమాలో మళ్ళీ డిగ్రీనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుందట. రొమాంటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఓ సినిమాలో రెజినా సైకాలజీ స్టూడెంట్ గా నటిస్తోంది. ఇప్పటి వరకూ ఆమె చేసిన సినిమాలకు భిన్నంగా ఈ సినిమాలో కనిపించనుందట ఈ బ్యూటీ.

ఈ సినిమాలో రెజీనా క్యారెక్టర్ చాలా నేచురల్ గా వచ్చింది. ఈ సినిమాలో సైకాలజీ స్టూడెంట్ గా చాలా బాగా నటించింది. ఆమె క్యారెక్టర్ పరంగా కొన్ని డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. అయితే ఆమె రియల్ లైఫ్ సైకాలజీ స్టూడెంట్ అని మాకు తరువాత తెలిసింది అని దర్శకుడు కమ్ సినిమాటోగ్రాఫర్ నిజర్ షఫీ చెప్పడం విశేషం. ఈ సినిమాకు ఒకే చెప్పేందుకు రెజీనా పెద్దగా సమయం తీసుకోలేదట. ఆడియన్స్ ఈ సినిమాలో రెజీనాను డిఫరెంట్ లైట్ లో చూస్తారని డైరెక్టర్ తెలిపారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus