అరవింద సమేతకి గుమ్మడికాయ కొట్టే డేట్ ఫిక్స్

  • August 2, 2018 / 04:31 AM IST

ఓటమి చూసిన తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దెబ్బతిన్న సింహంలా ఉన్నారు. పని విషయంలో తాను పరిగెడుతూ… తన బృందాన్ని పరిగెత్తిస్తున్నారు. మాటల మాంత్రికుడు ప్రస్తుతం ఎన్టీఆర్ తో “అరవింద సమేత వీర రాఘవ” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే, ఈషా రెబ్బా హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రం వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. మరో వైపు డబ్బింగ్ కూడా చెప్పిస్తున్నారు. ఇప్పుడు నగర శివార్లలో ఈ మూవీ చిత్రకరణ సాగుతోంది. తారక్ కూడా రెస్ట్ తీసుకోకుండా సినిమా బాగారావాలనే కసితో చేస్తున్నారు. ఇక్కడ షూటింగ్ అయిన తర్వాత ఒక పాట కోసం విదేశాలకు వెళ్లనున్నట్టు తెలిసింది.

ప్రొడక్షన్ వర్క్ మొత్తం సెప్టెంబర్ 15 నాటికీ కంప్లీట్ కావాలని చిత్ర బృందానికి త్రివిక్రమ్ టార్గెట్ పెట్టినట్టు తెలిసింది. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులను సెప్టెంబర్ చివరి నాటికీ కంప్లీట్ చేసి ప్రచారంలోకి దిగాలని ప్లాన్ వేశారు. రాయలసీమ నేపథ్యంలో ఇదివరకు ఎన్నో సినిమాలు వచ్చాయి. అటువంటి కథల్లో ఎన్టీఆర్ కూడా నటించారు. అయితే వాటన్నిటికీ విభిన్నంగా ఈ చిత్రం ఉంటుందని సమాచారం. తారక్ నటనలోని మరో కోణాన్ని త్రివిక్రమ్ ఆవిష్కరించనున్నట్టు తెలిసింది. జగపతి బాబు, నాగబాబు తదితరులు నటిస్తున్న ఈ సినిమాని దసరా సందర్భంగా అక్టోబర్ 11 న రిలీజ్ చేయనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus