సంక్రాంతికి మా సినిమాను తీసుకొస్తాం.. కచ్చితంగా తీసుకొస్తాం. ఈ విషయం చెప్పడానికి ఒకే ఒక్క దారి ఆ టీమ్ రిలీజ్ చేసే పోస్టర్/ వీడియోలో డేట్‌ని వేయడమే. ఆ తర్వాత పదే పదే ఆ సినిమా ప్రచారంలో చెబుతూ వస్తారు. కానీ ఈ మధ్య సంక్రాంతికి సినిమాలు తీసుకొస్తాం అంటూ లాక్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. ఈ విషయంలో ప్రముఖ దర్శకుడు, హిట్ మెషీన్ అనిల్ రావిపూడి తొలి స్థానంలో ఉంటే.. ఇప్పుడు ఇదే లిస్ట్‌లోకి మాస్ దర్శకుడు బాబీ కొల్లి కూడా వచ్చారు.
మెగా 158 సినిమాకు ‘కాకా’ అని పేరు పెట్టారు. ‘సత్యం అన్నా ఓ వన్ వీక్ లీవ్ కావాలి’ అని సునీల్ అడిగితే.. ‘మన టార్గెట్ పండగరా.. అప్పటి దాకా ఎవరికీ సెలవులు లేవు’ అని చిరంజీవి అంటారు. ఈ మాట సినిమాలో ఆ సీన్ నేపథ్యంలోనే రావొచ్చు కానీ.. టీజర్‌లో ఆ మాటను వాడుకోవడం వెనుక పెద్ద కారణమే ఉంది అనిపిస్తోంది. అదే ఈ సినిమాను సంక్రాంతికే తీసుకొస్తాం అని చెప్పడం. మెన్నీమధ్య ‘సంబరాల యేటి గట్టు’ సినిమా సంక్రాంతి రిలీజ్ అని చెప్పడం గురించి తెలిసిందే.
మేనల్లుడు సినిమా వస్తోంది కాబట్టి.. చిరంజీవి సంక్రాంతికి రారు అని ఓ వార్త చక్కర్లు కొట్టింది. అయితే ‘తమ టార్గెట్ సంక్రాంతే’ అని చిరంజీవి – బాబి ఈ డైలాగ్ ద్వారా చెప్పారనే చెప్పాలి. అలా ఎలా ఫిక్స్ అవుతారు.. ఇంకా సినిమా పూర్తవ్వకుండానే డేట్ ఇచ్చేస్తారా. ఇలా చెప్పి లాక్ చేస్తారా అని అనుకోవద్దు. ఎందుకంటే ఈ సినిమా డైలాగ్‌తో లాక్ చేస్తే.. అనిల్ రావిపూడి తన కొత్త సినిమాకు ‘జనవరి 12 విడుదల’ అంటూ టైటిల్‌తోనే లాక్ చేశారు.
ఎలా అయితే ఏముంది కానీ. సంక్రాంతికి రాబోయే సినిమాల్లో నాలుగు సినిమాల డేట్స్ ఫిక్స్ అయ్యాయి. చూద్దాం ఇంకా కొన్ని సినిమాలు సంక్రాంతి కోసం రెడీ అవుతున్నాయి. అవేం డేట్స్ చెబుతాయో. అన్నట్లు ‘కాకా’ రిలీజ్ డేట్ చెప్పలేదు కదా జనవరి 13.