ఆనాటి సంగతులను గుర్తు చేసుకున్న రేణు దేశాయ్

  • October 25, 2018 / 12:20 PM IST

కొన్ని జ్ఞాపకాలు మనల్ని విడిచి పెట్టలేవు. జీవితాంతం మనవెంటే ఉంటాయి. అలాగే రేణు దేశాయ్.. పవన్ కళ్యాణ్ తో గడిపిన క్షణాలను ఎప్పటికి మరిచిపోరు. రెండో పెళ్లి చేసుకోబోతున్నా.. పవన్ అభిమానుల నుంచి విమర్శలు వస్తున్నప్పటికీ పవన్ ప్రస్తావన తీసుకురాకుండా ఉండలేరు ఆమె. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా “జానీ” సినిమా షూటింగ్ నటి సంగతులను షేర్ చేసుకున్నారు. ‘‘జానీ సినిమాకు నేను మొదట ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేశాను. షూటింగ్‌కు రెండు వారాల ముందు నన్ను ఈ చిత్రానికి హీరోయిన్‌గా చేయమన్నారు. నేను ఒప్పుకోలేదు. నా ఆసక్తి మొత్తం ప్రొడక్షన్ డిజైనింగ్, సాంకేతిక వర్గంపైనే ఉంది.

కానీ చివరికి పవన్ నన్ను ఒప్పించారు. దీంతో ఏడు నెలల పాటు రోజుకు 17 గంటలు పనిచేశా. ప్రొడక్షన్ డిజైనర్‌గా పనులు చూసుకుని, మేకప్ రూమ్‌కి వెళ్లి హీరోయిన్‌గా సిద్ధమయ్యేదాన్ని. జీవితం ఏదైనా సవాలు విసిరితే.. స్వీకరించాలి. అప్పుడే మనం వ్యక్తిగతంగానూ, వృత్తిపరంగానూ ఎంతో నేర్చుకుంటాం’’ అని రేణు పోస్ట్ చేశారు. ఈ సినిమా విజయవంతంకాకపోయినప్పటికీ పవన్ లోని దర్శకత్వ ప్రతిభని బయటపెట్టింది. పవన్ కళ్యాణ్, రేణు మధ్య వచ్చే సన్నివేశాలు కన్నీరుని తెప్పిస్తాయి. ఆమె పోస్ట్ తో పవన్ అభిమానులు సైతం ఆ సినిమాని గుర్తుచేసుకుంటున్నారు .

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus