నాకు ఎప్పుడు చేసుకోవాలనిపిస్తే అప్పుడు చేసుకొంటా: రేణు దేశాయ్

దేనికైనా సరే ఒక పరిమితి ఉంటుంది. ఆ పరిమితి దాటితే ఏదైనా సరే ఇబ్బందికరంగానే ఉంటుంది. ఇప్పుడు కొంతమంది పవన్ కళ్యాణ్ అభిమానుల రచ్చ ఇబ్బందికరంగా మారింది. పవన్ కళ్యాణ్ ను ఎవరైనా తీడితే వాళ్ళ మీద రియాక్ట్ అవుతున్నారు సరే.. కానీ పవన్ కళ్యాణ్ సొంత సతీమణి రేణు దేశాయ్ మీద కూడా కొందరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా సాక్షిగా దాడి చేయడం ఏంటో ఎవరికీ అర్ధం కానీ ప్రశ్న. దాదాపు ఎనిమిదేళ్లపాటు ఓటరితనాన్ని అనుభవించిన రేణు దేశాయ్ ఇటీవల తన మనసుకి నచ్చిన వ్యక్తిని వివాహమాడేందుకు నిశ్చయించుకొని ఈమేరకు ఎంగేజ్ మెంట్ కూడా చేసుకొంది. అయితే.. రేణు రెండో పెళ్లి చేసుకోవడం ఏదో పెద్ద మహా తప్పిదంలా ఫీలైపోయిన కొందరు మతిలేని లేక చెడిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అదే పనిగా రేణు దేశాయ్ ను నిందించడం, ట్విట్టర్ సాక్షిగా ఆమెను అసభ్యంగా మాట్లాడడం మొదలెట్టారు. దాంతో సంతోషంగా తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టాల్సిన సమయంలో ఇలా అనవసరమైన విషయాల గురించి బాధపడడం ఎందుకు అనుకొన్న రేణు దేశాయ్ ట్విట్టర్ నుంచి ఎగ్జిట్ అయ్యింది.

ఇకపోతే.. రేణు దేశాయ్ కి ఎంగేజ్ మెంట్ జరిగి ఏడాది పూర్తైనా ఆమెకు ఇంకా పెళ్లి జరగకపోవడంతో.. కొందరు ఆమె ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ అయ్యిందని వార్తలు సృష్టించడం మొదలెట్టారు. దానికి స్పందించిన రేణు దేశాయ్.. నాకు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి అనిపిస్తే అప్పుడు చేసుకొంటాను… మధ్యలో నీమీ కంగారు ఏమిటో అర్ధం కావడం లేదు. నా ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ అవ్వలేదు” అని క్లారిటీ ఇచ్చింది రేణు. ఈవిడని ఇలా ఇబ్బందిపెట్టడం వలన ఈ సో కాల్డ్ సైకో ఫ్యాన్స్ కి ఏం ఒరుగుతుంది అనేది ఎవరికీ అర్ధం కాని విషయం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus