పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య, ఒకప్పటి నటి రేణు దేశాయ్ ఫిల్మ్ మేకర్స్ కి తాజాగా సలహా ఇచ్చింది. కొత్త సంవత్సరం స్వాగత సమయంలో బెంగళూర్ లో ఓ మహిళపై లైగింక దాడి జరిగిన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దానిపై అన్ని వర్గాల ప్రజలు స్పందిస్తున్నారు. ఆ సంఘటన పట్ల, బాధను, భయాన్ని వ్యక్తంచేస్తున్నారు. ఆ వీడియోని చూసిన రేణు దేశాయ్ తన అభిప్రాయాన్ని వెళ్లబుచ్చింది. ఫిల్మ్ మేకర్స్ సినిమాల్లో మహిళలపై వేధిపులను చూపించవద్దని, అలాంటి సన్నివేశాల ప్రభావం సమాజంపై పడుతుందని ఒక అభిమాని అభిప్రాయానికి మద్దతు తెలిపింది.
ఒక నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా సమాజ శ్రేయస్సు ముఖ్యమని వెల్లడించింది. సినిమాల్లో అటువంటి మహిళలను అబ్యూజ్ చేసే సీన్లు పెట్టొద్దని సలహా ఇచ్చింది. మరో విషయంపై కూడా ఘాటుగా స్పందించింది. “అందరూ అమ్మాయిల డ్రస్సులు, వారి ప్రవర్తన గురించి విమర్శిస్తున్నారు. అమ్మాయిలు వేసుకునే డ్రస్సుల్లో ఏమిలేదు.. చూపుల్లోనే తేడా ఉంది” అని చెప్పింది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.