దేనికైనా సరే ఒక పరిమితి ఉంటుంది. ఆ పరిమితి దాటితే ఏదైనా సరే ఇబ్బందికరంగానే ఉంటుంది. ఇప్పుడు కొంతమంది పవన్ కళ్యాణ్ అభిమానుల రచ్చ ఇబ్బందికరంగా మారింది. పవన్ కళ్యాణ్ ను ఎవరైనా తీడితే వాళ్ళ మీద రియాక్ట్ అవుతున్నారు సరే.. కానీ పవన్ కళ్యాణ్ సొంత సతీమణి రేణు దేశాయ్ మీద కూడా కొందరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా సాక్షిగా దాడి చేయడం ఏంటో ఎవరికీ అర్ధం కానీ ప్రశ్న. నిన్నమొన్నటివరకూ పర్సనల్ లైఫ్ గురించి కామెంట్ చేశారు. ఆఖరికి నిన్న జరిగిన ఎలక్షన్స్ కి కూడా రేణు దేశాయ్ ను ఇబ్బందిపెట్టారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్.
“వెళ్ళి ఓట్ వెయ్యి.. కనీసం అన్నయ్యను ఇప్పటికైనా సపోర్ట్ చెయ్” అంటూ రేణు దేశాయ్ కి నిన్న చాలా మంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మెసేజులు చేయడం మొదలెట్టారట. ఆ మెసేజులు శ్రుతి మించడంతో స్పందించింది రేణు దేశాయ్. నా ఓటు ఇక్కడ లేదు.. నా ఓటును ఎప్పుడు, ఎలా వినియోగించుకోవాలో నాకు బాగా తెలుసు. మీరు చెప్పాల్సిన అవసరం లేదు” అని సీరియస్ అయ్యింది రేణు దేశాయ్. ఇలా ఆమె పర్సనల్ లైఫ్ ను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పదే పదే ఇబ్బందికి గుర్తి చేస్తుండడం ఏమాత్రం బాగోలేదని అందరూ అభిప్రాయపడ్డారు.