Pawan Kalyan: పవన్ కళ్యాణ్ విడాకుల వేళ.. మాజీ భార్య రేణు దేశాయ్ పోస్ట్ వైరల్

పవన్ కళ్యాణ్ తన మూడో భార్య అన్నాతో విడాకులు తీసుకున్నాడు. దీంతో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ చేస్తూ ఆ వార్తని ట్రెండింగ్లో నిలిపారు. ఇది పవన్ కళ్యాణ్ అభిమానులకే కాదు.. పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా అభిమానించేవారిని సైతం ఇబ్బంది పెడుతుంది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ పెట్టిన పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

Pawan Kalyan

“సంవత్సరం పొడుగునా వాహనాలు, పరిశ్రమల వల్ల కాలుష్యం పెరుగుతూనే ఉంది, ఈ ఒక్క రోజు కాల్చితే ఏమవుతుంది” అని వాదించడం ఇక్కడ అప్రస్తుతం. ఎందుకంటే ఇక్కడ ప్రధాన సమస్య పర్యావరణ కాలుష్యం కంటే.. శబ్ద కాలుష్యం, ఎదుటివారి మనోభావాలు. మీ అత్యుత్సాహం వల్ల కలిగే శబ్దకాలుష్యం వల్ల వృద్ధులకు, పసిపిల్లలకు, అనారోగ్యంతో బాధపడేవారికి ఎంతటి నరకాన్ని చూపిస్తాయో ఒక్కసారి ఆలోచించండి.

గుండె జబ్బులు ఉన్నవారు, ప్రశాంతత కోరుకునే వృద్ధులు ఆ శబ్దాలకు ఎంతటి ఒత్తిడికి లోనవుతారో అర్థం చేసుకోండి. మనం ఆనందించడం కోసం ఇతరులను మానసికంగా హింసించడం కరెక్ట్ కాదు. పండుగను శబ్దాల పోటీగా మార్చకండి. మన చుట్టూ ఉన్న తోటి మనుషుల పట్ల కాస్త దయతో, సానుభూతితో వ్యవహరించాల్సిన బాధ్యత మనపై ఉంది. రాత్రి 10 గంటలకల్లా బాణసంచా కాల్చడం ముగించేసి, ఆ తర్వాత అందరూ ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా విశ్రాంతి తీసుకునే అవకాశం ఇవ్వాలి” అంటూ ఒక పోస్టులో రాసుకొచ్చింది రేణూ దేశాయ్.

మరో పోస్టులో… ” తోటివారి కష్టాన్ని, బాధను అర్థం చేసుకోవడమే నిజమైన మానవత్వం. మన ఆనందం కోసం ఇతరులను ఇబ్బంది పెట్టకూడదు, బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. దయ, జాలి ఉన్న సమాజాన్ని నిర్మించుకుందాం” అంటూ రాసుకొచ్చింది.రేణూ దేశాయ్ పోస్టులను బట్టి.. ‘పరోక్షంగా తన మాజీ భర్తపై సింపతీ చూపించిందని’ కొందరు భావిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ – అన్నా కొణిదెల విడాకులు.. ముందుగానే 3 సార్లు హింట్ ఇచ్చారా?

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus