యాక్షన్ కింగ్ అర్జున్ పై శ్రుతి హరిహరన్ కామెంట్స్ కి డైరెక్టర్ కౌంటర్!

ఈమధ్యకాలంలో ప్రపంచాన్ని, ముఖ్యంగా భారతదేశాన్ని వణికిస్తున్న అంశం “#MeToo”. సినిమా హీరోయిన్లు మాత్రమే కాక గవర్నమెంట్ & ప్రయివేట్ ఎంప్లాయిస్ మరియు జర్నలిస్టులు కూడా ఈ “మీ టూ” కారణంగా తాము ఎదుర్కొన్న ఇబ్బందులను సోషల్ మీడియా సాక్షిగా ప్రపంచానికి తెలియజేస్తున్నారు. తాజాగా యాక్షన్ కింగ్ అర్జున్ మీద కూడా లైంగుక వేధింపుల ఆరోపణలు వస్తున్నాయి. అర్జున్ తో కలిసి “నిబునన్” (తెలుగులో “కురుక్షేత్రం”) చిత్రంలో జంటగా నటించిన శ్రుతి హరిహరన్ ఇటీవల “షూటింగ్ టైమ్ లో ఒక రోమాంటిక్ సీన్ తీస్తున్న తరుణంలో అర్జున్ కావాలని తన వీపును తడిమాడ”ని శ్రుతి ఆరోపించింది. దాంతో అప్పటివరకూ ఆంజనేయస్వామి పరమ భక్తుడైన అర్జున్ పైకి అలా ఉన్నా.. లోపల మాత్రం శ్రీకృష్ణుడని అతడి దుమ్మెత్తిపోయడం మొదలెట్టారు నెటిజన్లు.

అయితే.. ఈ విషయమై ఇమ్మీడియట్ గా స్పందించాడు సదరు చిత్ర దర్శకుడు అరుణ్ వైద్యనాధన్. నిజానికి తాను ఇంకాస్త హాట్ సీన్ రాసుకొన్నానని, “తనకు కూడా వయసుకొచ్చిన కూతురు ఉంది, తాను ఇలాంటి సీన్స్ లో యాక్ట్ చేయలేను” అని అర్జున్ చెప్పడంతో రొమాన్స్ డోస్ తగ్గించి మళ్ళీ ఆ సీన్ ను రీరైట్ చేశానని వివరించాడు అరుణ్ వైద్యనాధన్. దాంతో.. శ్రుతిహరిహరన్ పబ్లిసిటీ కోసమే ఇలాంటి పోస్ట్ పెట్టిందని ఆమెపై దాడికి దిగారు అర్జున్ అభిమానులు. ఈ విషయంలో శ్రుతికి ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ లభించలేదు. మరి ఈ విషయంలో నిజం ఎంత, అబద్ధం ఎంత అనే విషయంలో క్లారిటీ రావాలి అంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus