చంద్రబాబు ముందు చిత్తుగా ఓడిపోయిన వర్మ

  • April 12, 2019 / 04:48 PM IST

కొందరు సినిమాలు ఫ్యాషన్ తో తీస్తారు, ఇంకొందరు డబ్బు కోసం, ఇంకొందరు సరదాగా తీస్తారు. వర్మ కూడా పై మూడిటి కోసం చాలా సినిమాలు తీశాడు. కానీ.. కేవలం చంద్రబాబు నాయుడ్ని డీగ్రేడ్ చేయడమే గోల్ గా తీసిన సినిమా మాత్రం “లక్ష్మీస్ ఎన్టీఆర్”. ఈ సినిమాను ఎలక్షన్స్ కి ముందు రిలీజ్ చేసి జనాలకు చంద్రబాబు నాయుడు మీద ఉన్న పాజిటివ్ ఇమేజ్ ను దెబ్బతీద్దామనుకున్నాడు. అయితే.. అపర చాణక్యుడు లాంటి చంద్రబాబు ముందు వర్మ ఆటలు సాగుతాయా చెప్పండి.

ఎలక్షన్ కోడ్ ను అడ్డు పెట్టుకొని ఆంధ్రాలో సినిమా రిలీజ్ అవ్వకుండా చేశాడు చంద్రబాబు. దాంతో తెలంగాణ మరియు ఓవర్సీస్ లో మాత్రమే రిలీజయ్యింది “లక్ష్మీస్ ఎన్టీఆర్”. ఈవారం ఆంధ్రాలో విడుదలవుతున్నప్పటికీ.. ఎలక్షన్స్ పూర్తయిపోయాయి కాబట్టి ఇప్పుడు సినిమా విడుదలైనా వర్మ అనుకున్న నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ అవ్వదు. సో, “లక్ష్మీస్ ఎన్టీఆర్” ద్వారా వర్మ గోల్ రీచ్ అవ్వలేదు. దాంతో.. సినిమాకి మూడునాలుగు కోట్ల రూపాయల దాకా లాభం వచ్చినప్పటికీ.. బాబు ఎత్తుల ముందు వర్మ జిత్తులు పనిచేయలేదని, పాపం ఆర్జీవీ ప్లాన్స్ అన్నిట్లీ బాబు తిప్పికొట్టాడని టిడిపి తమ్ముళ్ళు విజయ గర్వంతో చెప్పుకొంటున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus