బాలయ్య ఫ్యాన్స్ కు శుభవార్త ..!

  • March 9, 2019 / 05:31 PM IST

నందమూరి బాలకృష్ణ ని కలవకుండా ఉంటే అసలు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ తీయాలనే ఆలోచనే నాకు వచ్చేది కాదంటున్నాడు సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ గతంలో ‘రక్త చరిత్ర’ సినిమా చూసిన బాలకృష్ణ… పరిటాల రవి జీవితాన్ని చాలా అద్భుతంగా చూపించారని చెప్పాడట. ఇక అప్పటి నుండీ కొంత కాలం వీరిద్దరూ బాగానే టచ్ లో ఉన్నారు. ఆ చిత్రంలో ఎన్టీఆర్ పాత్ర కూడా చాలా బాగా రావడంతో బాలకృష్ణ ఫిదా అయిపోయాడట.

దీనికోసం ప్రత్యేకంగా రాంగోపాల్ వర్మను అభినందించడానికి వెంటనే ముంబై వెళ్ళి మరీ వర్మకి కృతజ్ఞతలు తెలిపాడట. అప్పటినుండీ వీరిద్దరూ ‘ఎన్టీఆర్ బయోపిక్’ గురించి ఆలోచించడం మొదలుపెట్టారట. అయితే ‘ఎన్టీఆర్ బయోపిక్’ తీస్తే లక్ష్మీ పార్వతి క్యారెక్టర్ ఉండాలని బాలయ్యకి చెప్పాడట వర్మ. దీంతో బాలయ్యకి కోపం వచ్చి మళ్ళీ ఎప్పుడూ వర్మని కలవలేదంట బాలయ్య. తరువాత వర్మ కూడా ‘ఎన్టీఆర్ బయోపిక్’ గురించి మరిచిపోయాడట. అయితే ఎప్పుడైతే బాలయ్య మళ్ళీ ‘ఎన్టీఆర్ బయోపిక్’ మొదలుపెట్టాలని ప్రయత్నాలు మొదలుపెట్టాడో..

అప్పుడే నేను కూడా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ తీయాలని బలంగా ఫిక్సయిపోయాడట వర్మ. ఈ విధంగా బాలయ్యను కలవడం వల్లే ఆ నాటి సంఘటనలు ఒక్కసారిగా మదిలో మెదిలాయని… అంతకంటే బెస్ట్ కథ మరోటి ఉండదని ఆ విధంగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ను మొదలెట్టానని వర్మ తెలియజేసాడు. ఈ చిత్రం నందమూరి, నారా ఫ్యామిలీలను నెగటివ్ గా చూపిస్తున్నప్పటికీ… బాలయ్యని మాత్రం పాజిటివ్ గానే చూపించబోతున్నాడని తెలుస్తుంది. మొత్తానికి బాలయ్య ఫ్యాన్స్ ఇది ఒక శుభవార్త అనే చెప్పాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus