రామ్ గోపాల్ వర్మ్….సినిమాల గురించి తెల్సిన వారందరికీ పరిచయం అవసరంలేని లేరు…అయితే అదే క్రమంలో ఆయన ట్వీట్స్ ను కూడా ఎవ్వరూ మరచిపోలేరు….ఆయన ఎప్పుడు ఎవర్ని ఎలా ఎందుకు తిట్టి కింద పడేస్తాడో….అదే క్రమంలో ఎవరిని ఎందుకు ఆకాశానికి ఎత్తేస్తాడో ఆయనెక్ తెలీదు….అయితే ఇదిలా ఉంటే మొన్నటి వరకూ చిరు-బాలయ్య సినిమాల విషయంలో స్పందించిన వర్మ తాజాగా…తన మైండ్ ను జల్లికట్టు వైపు తిప్పుకుని ఆయన స్టైల్ లో మొదలు పెట్టాడు….జల్లికట్టు ఆడేవారిపై ఇప్పటికే బండబూతులు తిట్టేస్తూ ట్వీట్లు చేసేసిన ఆయన.. తాజాగా మరోసారి తన స్టైల్ లో ఓపెన్ అయిపోయాడు….. జల్లికట్టు అనాగకరికమని.. వినోదం కోసం మూగజీవుల్ని హింసించటంగా అభివర్ణించే వర్మ.. జల్లికట్టులో మరణించిన వారి గురించి ట్వీట్ చేస్తూ.. ‘‘జల్లికట్టు నిర్వహణలో ఇద్దరు మృతి చెందారు.
129 మంది గాయపడ్డారు. ఇప్పుడు జల్లికట్టు మద్దతుదారులు ఏమంటారు? దీన్ని చూస్తే.. జల్లికట్టుపై దేవుడికి కూడా కోపం ఉన్నట్లుంది ఉంది. జల్లికట్టు మద్దతుదారులపై కోపంచూపిస్తూ.. ఎద్దులపై జాలి చూపిస్తున్నట్లుగా ఉంది’’ అని వ్యాఖ్యానించారు. ఈ ఘటనతో అయినా.. అనాగరికమైన జల్లికట్టు క్రీడను ఆపుతారని తాను ఆశిస్తున్నట్లుగా వర్మ పేర్కొన్నారు. అసలే భగవంతుడు అంటే వర్మకు ఇష్టం ఉండదు, ఇక ఇప్పుడు ఈ ఉదంతాన్ని భగవంతుడికి ముడి పెట్టి మరీ వర్మ ట్వీట్స్ చేస్తూ ఉండడం చూస్తుంటే….మళ్ళీ మరో వివాదానికీ వర్మ తెరలేపుతున్నట్లు కనిపిస్తుంది….చూద్దాం మరి ఏం జరుగుతుందో….
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.