ఆఖరికి ఆర్జీవీ టీచర్లను కూడా వదలట్లేదు

వివాదాలు సృష్టించడంలో రాంగోపాల్ వర్మ ‘పీ.హెచ్.డి’ చేశాడన్న సంగతి తెలిసిందే. తన సినిమాల విషయంలో రక రకాల పద్ధతుల్ని అనుసరించి పబ్లిసిటీ చేసుకునే వర్మ… మొన్నటికి మొన్న ప్రభాస్ నా క్యాస్ట్ అంటూ చేసిన కామెంట్ పెద్ద దుమారమే రేపింది. అలా ప్రభాస్ పేరు చెప్పుకుని తన తరువాతి సినిమా అయిన ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అనే సినిమాని ప్రమోట్ చేసుకోవడం మొదలు పెట్టాడు. ఆ సినిమాలో నుండీ ఓ పాటని కూడా విడుదల చేశాడు. ఇదలా ముగిసిందో లేదో ఈరోజు … టీచర్స్ డే కాబట్టి ఇప్పుడు టీచర్స్ పై అసభ్యకరమైన కామెంట్ చేశాడు.

ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. విషయం ఏమిటంటే… టీచర్స్ డే రోజున ‘టీచర్స్ విస్కీ’ అనే ఆల్కహాల్ బ్రాండ్ కి సంబంధించిన ఓ ఫోటోని పోస్ట్ చేస్తూ…. “నా టీచర్లంతా నన్నో మంచి విద్యార్థిగా, మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా తీర్చిదిద్దడంలో దారుణంగా విఫలమయ్యారు. కాబట్టి టీచర్స్ డే రోజున ఏం మాట్లాడాలో నాకు తెలియదు. బహుశా నేను బ్యాడ్ స్టూడెంట్ ని కావచ్చు. ఒక బ్యాడ్ స్టూడెంట్ ని గుడ్ స్టూడెంట్ గా మార్చడం టీచర్ల భాద్యత. ఆ విషయంలో వాళ్ళు విఫలమయ్యారు కాబట్టి నా టీచర్లు బ్యాడ్ టీచర్స్ అని రుజువైంది. టీచర్స్ డే సందర్భంగా టీచర్లంతా ఈ ‘టీచర్స్ విస్కీ’ త్రాగి సెలెబ్రేట్ చేసుకుంటారా ? జస్ట్ ఆస్కింగ్” అంటూ ట్వీట్లో పేర్కొన్నాడు. ఇది రెగ్యులర్ సోషల్ మీడియా ఆడియన్స్ కు కొత్తేమీ కాదు కానీ.. కొంతమంది మాత్రం ‘ వర్మ రోజు రోజుకీ దిగజారిపోతున్నాడు.. ఆకటికి టీచర్స్ ను కూడా వదలట్లేదు’ అనే కామెంట్స్ చేస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus