మాటకే బాహుబలి….టార్గెట్ అంతా మెగా…స్టార్స్ పైనే!!!

  • March 17, 2017 / 06:49 AM IST

దర్శకుడు…నిర్మాత…వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ అయిన మన రామ్ గోపాల్ వర్మ…అవకాశం దొరికితే చాలు…..మెగా హీరోలపై విరుచుకు పడిపోతాడు…అసలు మెగాస్టార్ పవర్ స్టార్ అన్న ఆలోచన కూడా ఉండదు…వారిపై పడి ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తూనే ఉంటాడు….ఇదిలా ఉంటే…మెగా హీరోలను టార్గెట్ చేసి విమర్శలు చెయ్యడానికి ఎప్పుడూ ఏదో ఒక సంధర్భం కోసం ఎదురు చూస్ మన వర్మకు ఈసారి బాహుబలి2 ఒక మంచి అవకాశంగా దొరికింది….విషయంలోకి వెళితే…బాహుబలిని పొగడాలి అనుకున్నాడో…లేక మెగా ఫ్యామిలీని టార్గెట్ చెయ్యాలి అనుకున్నాడో తెలీదు కానీ….వర్మ మళ్ళీ ట్వీట్ చేశాడు….‘బాహుబలి 2’ ట్రైలర్ ను ఆకాశానికి ఎత్తేస్తూ మెగాస్టార్‌ సూపర్‌ స్టార్‌ పదాలను వాడుతూ ఆ టాప్ స్టార్స్ ను అవమాన పరిచే రీతిలో వర్మ ఘాటైన కామెంట్స్ చేసాడు. ప్రభాస్‌ కాలి గోటినందుకోవడానికి మెగా సూపర్ స్టార్స్ అందరికీ రెండున్నర జన్మలు పడుతుంది అంటూ వర్మ లేటెస్ట్ గా ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన కామెంట్స్ ఇప్పుడు పెను సంచలమంసృష్టిస్తున్నాయి.

వర్మ తన ట్విటర్ లో వాడిన పదాలు ఖచ్చితంగా మెగా హీరోలను ముఖ్యంగా మెగా కాంపౌండ్ ను టార్గెట్ చేసేదిగా ఉంది అన్నది ఓపెన్ సీక్రెట్. ఇదే సందర్భంలో వర్మ మరొక ట్విట్ చేస్తూ టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరు నేషనల్ స్టార్స్ గా మారడానికి ప్రయత్నించి ఘోరంగా విఫలం అయ్యారు అని అంటూనే….. అదే క్రమంలో ప్రభాస్ మాత్రం కేవలం రెండే రెండు దెబ్బలతో నేషనల్ స్టార్ అయిపోయాడు అంటూ కామెంట్ చేసాడు. వర్మ మాటల్లో ఆంతర్యం ఏమో తెలీదు కానీ…ఈ కామెంట్స్ ను లోతుగా విశ్లేషిస్తే బాలీవుడ్ లో తమ సత్తాను చాటాలని ప్రయత్నించిన చిరంజీవి పవన్ లు తమ సినిమాలకు సంబంధించి ఘోరంగా విఫలం అయిన సందర్భం గుర్తుకు వస్తుంది. మరి దీనిపై మెగా-పవర్ అభిమానులు ఎలాంటి రచ్చ మొదలు పెడతారో చూడాలి.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus