ఇది వర్మ చెప్పిన నగ్నసత్యం!

కత్తి మహేష్-పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నడుమ సమస్యలు సమసిపోయాక ఏ టీవి చానల్ పెట్టినా ప్రతి సగటు ప్రేక్షకుడికి కనిపించిన అంశం “గాడ్ సెక్స్ & ట్రూత్”. “పద్మావతి” చిత్ర విడుదలను ఆపేయమని కర్ణిసేన, రాజ్ పుత్ లు కలిసి చేసిన హడావుడి కంటే ఎక్కువగా మన తెలుగు న్యూస్ చానల్స్ మరియు కొందరు నిరసన కర్తలు, మహిళా సంఘాలు “గాడ్ సెక్స్ ట్రూత్” విడుదలను ఆపేయాలని గొడవలు చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా కేవలం ఆన్ లైన్ లో విడుదలవుతున్న “గాడ్ సెక్స్ & ట్రూత్” చిత్రాన్ని ఏదో థియేటర్లలో విడుదలవుతున్నట్లుగా “విడుదల ఆపేయండి” అంటూ ఎందుకు హడావుడి చేశారనేది ఎంత ఆలోచించినా అర్ధం కానీ విషయం. ఆ వాదనలు, నిరసనలు, డిబేట్లు, గొడవలు వంటివన్నీ రాంగోపాల్ వర్మ పబ్లిసిటీ కోసం వాడుకోగా.. న్యూస్ చానల్స్ వారికి మాత్రం టీయార్పీ రేట్స్ కోసం ఉపయోగపడ్డాయి.

ఈ గొడవల పబ్లిక్ లో “గాడ్ సెక్స్ & ట్రూత్” పట్ల ఏస్థాయిలో ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యిందంటే.. గతవారం రోజులుగా గూగుల్ లో 70% మంది భారతీయులు “మియా మాల్కోవా, గాడ్ సెక్స్ & ట్రూత్” కోసం మాత్రమే సెర్చ్ చేస్తున్నారు. ఇక నిన్న ఉదయం నుంచి ఈ ఫిలిమ్ అప్లోడ్ చేయబడిన వెబ్ సైట్ అయితే హెవీ ట్రాఫిక్ కారణంగా సెర్వర్ డౌన్ కూడా అయిపోయింది. మరి ఇంతలా హల్ చల్ చేసిన “గాడ్ సెక్స్ & ట్రూత్”లో ఏముంది? అనే ఆసక్తి అందరిలో పెరిగిపోయింది.
అందుకే “గాడ్ సెక్స్ & ట్రూత్” అనే మినీ ఫిలిమ్ ను 150 రూపాయలు ఆన్లైన్ ద్వారా చెల్లించి మరీ చూసి ఈ సమీక్ష రాయడం జరుగుతోంది.

నటీమణి: మియా మాల్కోవా (25 ఏళ్ళు)
రచన-కాన్సెప్ట్-పిక్చరైజేషన్: రాంగోపాల్ వర్మ (55 ఏళ్ళు)
సంగీతం: ఎం.ఎం.క్రీమ్ అలియాస్ కీరవాణి (56 ఏళ్ళు)
లొకేషన్: ఒక ఫైవ్ స్టార్ హోటల్ లోని స్వీట్ రూమ్
విడుదల తేదీ: జనవరి 26, 2018
సందర్భం: గణతంత్ర దినోత్సవం
జోనర్: శృంగారం
నిడివి: 19 నిమిషాలు

మన భారతీయ సాంప్రదాయం చాలా విచిత్రమైనది. పురాణాలు, ఇతిహాసాలను మొదలుకొని 10th క్లాస్ లో సైన్స్ సబ్జెక్ట్ తో సహా శృంగారం గురించి, దాని ప్రాముఖ్యత గురించి చెబుతుండగా.. భారతీయులు మాత్రం “శృంగారం అంటే బూతు”లా చూస్తుంటారు. దైనందిన జీవితంలో ఆకలి, దాహం లాగే శృంగారం అనేది కూడా ఒక భావం-అవసరం అయినప్పుడు దాని గురించి మాట్లాడుకోవడానికి ఎందుకు సంకోచిస్తారు అనే విషయం ఇప్పటికీ చాలామందికి అర్ధం కాదు. ఫారిన్ కంట్రీస్ లో ఒక వయసొచ్చాక తల్లిదండ్రులే వారి పిల్లలతో లైంగిక అవసరాల గురించి చర్చిస్తారు. అందువల్ల పిల్లల్లో సెక్స్ పట్ల వ్యామోహం కాక అవగాహన పెరుగుతుంది. ప్రపంచంలో జరిగే సగానికిపైగా మానభంగాలు కేవలం అవగాహన లేమి కారణంగా జరిగేవే ఎక్కువ. సెక్స్ అంటే ఒక కోరికలా మాత్రమే మిగిలిపోతుంది. మన సినిమాలు అందుకు ప్రేరేపిస్తున్నాయనుకోండి.

కానీ.. రాంగోపాల్ వర్మ రెగ్యులర్ సినిమాలు తీసినట్లుగా ఈ “గాడ్ సెక్స్ & ట్రూత్”ను మన సౌత్/నార్త్ ఆర్టిస్టులతో చిత్రీకరించి థియేటర్లలో విడుదల చేయలేడు కాబట్టి ఆన్లైన్ ఆప్షన్ ను ఎంచుకొన్నాడు. అసలు దేవుడు సెక్స్ అనేది ఎందుకు సృష్టించాడు అనే విషయాన్ని తనదైన శైలిలో చెప్పాడు.

ఇదే విషయాన్ని ఒక చక్కని డాక్యుమెంటరీ రూపంలో ఒక అందమైన మహిళ చేత నిండైన ఆరు గజాల చీర కట్టి కామెరా ముందు కూడా కూర్చోబెట్టి చెప్పించవచ్చు. కానీ.. ఆ విధంగా చీర కట్టుకొని చెబితే ఎవరు వింటారు చెప్పండి. అందుకే ఒక పాపులర్ పోర్న్ స్టార్ ను తన మాధ్యమంగా ఎంచుకొన్నాడు. ఆమె నగ్నదేహం ఆధారం చేసుకొని అందరూ మాట్లాడుకోవడానికి ఇబ్బందిపడే విషయాల్ని చర్చించాడు. ఇదేమీ భారీ స్థాయిలో తెరకెక్కే సినిమా కాదు, అందుకే కెమెరా బాధ్యతలు కూడా ఆర్జీవి స్వీకరించి తానే తెరకెక్కించాడు.

ఇక “గాడ్ సెక్స్ & ట్రూత్” విషయానికి వస్తే..

సాక్ష్యాత్తు ఆ దేవతల గ్యాంగ్ లీడర్ అయిన ఇంద్రుడే పరాయి ఆడదాని యద సంపద చూసి క్షణకాలం తాను దేవతల రాజుని అని మరచి ఆమెను పొందడం కోసం దివి నుంచి భూమికి దిగివచ్చాడట. ఇక మానవమాత్రులం మనమెంత. శృంగారం అనేది నేచురల్ డిజైర్. ఏ పురుషుడికి/స్త్రీకి అయినా వేరే ఏ స్త్రీ/పురుషుడి మీద అయిన కమవాంఛ కలుగుతుంది. అంతమాత్రానా వారు అధములు అని కాదు.
అయితే.. శృంగారం అనేది సృష్టించబడినది కేవలం కామక్రోధాల్ని చల్లార్చుకోవడం కోసం కాదు. ఒక పురుషుడు మరో స్త్రీలో కలిసిపోవడం కోసం, ఒక స్త్రీ తాను ఇష్టపడ్డ పురుషుడ్ని పూర్తిస్థాయిలో తనలో ఐక్యం చేసుకోవడానికి దోహదపడే గొప్ప సంగమ సమయమది.

మనం చిన్నపిల్లల్ని కాళ్ళ మీద, వీపు మీద ముద్దాడుతాం, ఆఖరికి వారి కాళ్ళకి మట్టి అంటినా దాన్ని మన చేతులతోనే తుడిచి మరీ ముద్దు చేస్తాం. ఎందుకంటే వారి మీద విపరీతమైన మమకారం ఆ కాలికి అంటిన మట్టి మీదకంటే ఆ బుడతడి పసిదనపు ఛాయాల మీదే మన దృష్టి కేంద్రీకృతమయ్యేలా చేస్తుంది. అలాగే.. శృంగారంలో పాల్గొనే యువతీయువకులు ఒకర్నొకరు ముద్దాడుతారు, తమ భాగస్వామి రహస్య కేంద్రాలను తాకుతారు. అదంతా శృంగారంలో ఒక భాగమే కానీ జుగుప్సాకరమైన విషయం అయితే కాదు.

అలాగే స్త్రీ శరీరభాగాల్లో యద సంపద, యోని అనేవి కాలకృత్యాలు తీర్చుకోవడంలో కంటే రతి సమయంలో ఎక్కువగా ఉపయోగపడుతుంటాయి. అందుకే స్త్రీ శరీరాన్ని ఆరాధించండి. భవిష్యత్ కాలంలో కులం, మతం, రాజకీయం, వ్యాపారం కంటే ఎక్కువగా మానవాళిని శాసించేది శృంగారం మాత్రమే. ఎంతటి మహాఘనుడైనా, మహానుభావుడైనే శృంగార సమయంలో ఆడదాని ముందు మోకరిల్లల్సిందే.

ఇదేనండీ రాంగోపాల్ వర్మ తన “గాడ్ సెక్స్ & ట్రూత్” ద్వారా చెప్పదలుచుకొన్న, చెప్పిన విషయాలు. ఇదేమీ పోర్న్ మూవీ కాదు, ఏదో ఉంటుందని, మియా మాల్కోవా నగ్నదేహాన్ని ఆస్వాదించేద్దామనే ఆలోచనలతో ఈ “గాడ్ సెక్స్ & ట్రూత్”ను చూస్తే మాత్రం మామూలు నిరాశకు లోనవ్వరు. సో, ఇక్కడ చెప్పొచ్చేదేమిటంటే.. మియా మాల్కోవా దేహాన్ని, ఆమె ఫ్లెక్సిబిలిటీని పూర్తి స్థాయిలో యూటిలైజ్ చేసుకొని ఆమె అంగంగాన్ని వీలైనంతగా వర్ణించిన చిత్రమే “గాడ్ సెక్స్ & ట్రూత్”.

ఒక రకంగా చెప్పాలంటే.. మియా మాల్కోవాకు ఇది ఒక డెమో ఫిలిమ్ లాంటిది. ఆమె శరీరంలోని ఎత్తుపల్లాల్ని, ఒంపుసొంపుల్ని అందంగా, అసభ్యత లేకుండా (నగ్నంగా చూపించడం వేరు, అసభ్యంగా చూపించడం వేరు) టెన్త్ లో బయాలజీ క్లాస్ లో కప్ప మరియు దాని లోపలి భాగాలు గురించి వివరించినంత అర్ధవంతంగా తెరపై ఆవిష్కరించాడు ఆర్జీవి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus