సినిమా ప్రచారంలో ఎక్కడా ఆ హీరోయిన్ చూపించకుండా.. సినిమాలో సడన్‌గా చూపిస్తే.. సడన్ క్యారెక్టర్‌లా ఎంట్రీ ఇచ్చి ఆఖరికి మెయిన్ క్యారెక్టర్ అయిపోతే సర్‌ప్రైజింగ్‌గా ఉంటుంది. ఇలాంటి సర్‌ప్రైజ్‌లు టాలీవుడ్‌లో గతంలో జరిగాయి. ఒక సర్‌ప్రైజ్ వల్ల హీరోయిన్ కెరీర్ స్టార్టింగ్‌లోనే ఆగిపోతే.. మరో సర్‌ప్రైజ్ వల్ల ఆ హీరోయిన్ హర్టయింది. ఇటీవల ఆ విషయాన్ని ఆ హీరోయిన్ చెప్పుకొని కాస్త బాధపడింది. ఆమెనే రితికా నాయక్. ఇదంతా జరిగింది ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ విషయంలో.
ఇక అసలు విషయానికొస్తే.. విశ్వక్ సేన్, రుక్సార్ థిల్లాన్ జంటగా నటించిన చిత్రం ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’. ఆ సినిమా రిలీజయ్యే వరకు అందులో ఇంకో హీరోయిన్ ఉన్నట్లే చెప్పలేదు. దీంతో రుక్సర్ మాత్రమే ఉందని అనుకున్నారు. ప్రమోషన్లలో కూడా అమెనే కనిపించింది. ఈ సినిమాలో హీరోయిన్‌కి చెల్లెలి పాత్రలో ఎంట్రీ ఇస్తుంది సర్‌ప్రైజ్ ప్యాకేజ్ రితికా నాయక్. సినిమా చూస్తున్నపుడు రితిక హీరోయిన్‌లా అనిపించదు. సహాయ పాత్రలానే ఉంటుంది. కానీ క్రమంగా ఆ పాత్రే హైలైట్ అవుతుంది. సినిమా పూర్తయ్యేసరికి హీరోయిన్ ఆమెనే అని తేలుతుంది. రిలీజ్ తర్వాత రితికకు మంచి పేరు కూడా వచ్చింది.
అయితే, ప్రమోషన్లలో ఆమెను చూపించకుండా, ప్రోమోల్లో హైలైట్ కాకుండా ఈ హీరోయిన్ని ఇలా దాచి ఉంచడం సినిమాకు బాగా వర్కవుట్ అయింది. కానీ ఆ పని వల్ల తాను బాధ పడినట్లు రితిక చెప్పింది. తెలుగులో నటించిన తొలి సినిమా ప్రమోషన్లలో పాల్గొనకపోవడంపై బాధపడ్డానని చెప్పింది. ఈ విషయం తన ఫ్రెండుకు ఫోన్ చేసి బాధపడిందట. అయితే సినిమా రిలీజయ్యాక అందరూ ఆ పాత్ర గురించి మాట్లాడుకున్నారని, తనకు మంచి పేరొచ్చిందని చెప్పింది. దాంతో తనను దాచి ఉంచడం వల్లే మంచే జరిగింది అని చెప్పింది.
కొన్నిసార్లు ఓర్పుతో ఉండడం వల్ల కూడా మంచి ఫలితం వస్తుందని ఆ సినిమా విషయంలో తెలుసుకున్నాను అని చెప్పింది రితిక. ఆ సినిమా తర్వాత రితిక కొన్ని రోజులు కామ్‌గా ఉంది. తేజ సజ్జతో కలిసి చేసిన ‘మిరాయ్’ విజయంతో ఇప్పుడు వరుస సినిమాలు చేసింది/ చేస్తోంది. అలా వరుణ్ తేజ్‌కు జోడీగా నటించిన ‘కొరియన్ కనకరాజు’ ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.