“సాలా ఖద్దూస్” చిత్రంతో కథానాయికగా రూపాంతరం చెందిన బాక్సర్ రీతూ సింగ్, ఇప్పటికే విజయ్ సేతుపతి సరసన నటించే అవకాశం దక్కీంచుకొని కథానాయికగా తన కెరీర్ కు బలమైన పునాది వేసుకోంటోంది. ఇప్పుడీ అమ్మడికి మరో బంపర్ ఆఫర్ వచ్చిందట. అది కూడా మామూలు ఆఫర్ కాదు. ఏకంగా తమిళ స్టార్ కథానాయకుడు అజిత్ సరసన నటించే సదవకాశం.
అజిత్ 57వ చిత్రంలో కథానాయికగా ఇప్పటికే తమన్నాను ఎంపిక చేయగా.. సెకండ్ హీరోయిన్ గా రీతూ సింగ్ ను సెలక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అమ్మడు ఇంకా స్పష్టీకరించనప్పటికీ.. యూనిట్ వర్గాలు కన్ఫర్మ్ చేస్తున్నాయి!