ప్రభాస్, సుజీత్ కాంబినేషన్లో రానున్న మూవీకి హాలీవుడ్ ఫైట్ మాస్టర్

  • November 25, 2016 / 10:51 AM IST

“రన్ రాజా రన్” ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేయనున్న ఫిల్మ్ పనులు ఊపందుకున్నాయి.  తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో 150 కోట్లతో ఏకకాలంలో వంశీ, ప్రమోద్ లు నిర్మించనున్న ఈ మూవీకి ఆర్టిస్టులతో పాటు టెక్నీషియన్లను సెలక్ట్ చేస్తున్నారు. హీరోయిన్ గా అమీ జాక్సన్ ఫిక్స్ కాగా, విలన్ గా నీల్ నితిన్ ముఖేష్ ని ఖరారు చేశారు. ఈ సినిమాలో ఒక హైలెట్ గా కానున్న దుబాయ్ బుర్జ్ వద్ద ఫైట్ సీన్ ని కంపోజ్ చేయడానికి హాలీవుడ్ స్టెంట్ మ్యాన్ కెన్నీ ని తీసుకున్నారు. ఈయన ప్రస్తుతం శంకర్ రోబో 2 .0 కోసం యాక్షన్ సీన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు.

ఈ చిత్రం తర్వాత ప్రభాస్ కోసం 828  మీటర్ల ఎత్తులో ఫైట్ ని కంపోజ్ చేయనున్నారు. యూవీ క్రియేషన్ బ్యానర్లో తెరకెక్కనున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీలో ప్రభాస్ పోలీసాఫీసర్ పాత్ర పోషించనున్నారు. ఎక్కువ భాగం దుబాయి లో చిత్రీకరణ జరుపుకోనున్న ఈ చిత్రంలో ప్రభాస్ చేసే సాహసాలు జేమ్స్ బ్యాండ్ ని తలపిస్తాయని తెలిసింది. బాహుబలి కంక్లూజన్ షూటింగ్ లో బిజీగా ఉన్న ప్రభాస్ జనవరి నుంచి కొత్త సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus