బంపర్ ఆఫర్ కొట్టేసిన పూరి హీరో?

Advertisement

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ‘రోగ్‌’ చిత్రంతో తెలుగులో హీరోగా ప‌రిచయ‌మ‌య్యాడు ఇషాన్‌. మొదటి చిత్రంలో మంచి మాస్ పెర్ఫార్మన్స్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. ఆ చిత్రం ఫ్లాప్ అయినా హీరో నటనకి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. కానీ అవకాశాలు మాత్రం ఏమీ రాలేదు. ఇప్పుడు చాలాకాలం త‌ర‌వాత మ‌ళ్లీ తెర‌పైకి రాబోతున్నాడని సమాచారం. అయితే హీరోగా కాదు విలన్ గా రాబోతున్నాడు. అజ‌య్ భూప‌తి డైరెక్ట్ చేస్తున్న ‘మ‌హా స‌ముద్రం’ సినిమాలో విలన్ నటించబోతున్నాడట.

మాస్ మహా రాజ్ ర‌వితేజ ఈ చిత్రాన్ని ఓకే చేసేశాడని తెలుస్తుంది. వ‌ల్లూరిప‌ల్లి ర‌మేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. యంగ్ విల‌న్ల‌ కు ప్రస్తుతం మంచి డిమాండ్ ఉంది . ఇప్పటికే ఆది పినిశెట్టి, కార్తికేయ వంటి హీరోలు ఆ పాత్రల్లో రాణిస్తున్నారు. ఇక రవితేజ ప్ర‌స్తుతం ‘డిస్కోరాజా’ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఇది పూర్తయ్యాకే ‘మ‌హా స‌ముద్రం’ ఉంటుందనేది సమాచారం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news