ఎన్టీఆర్ ని అభినందించిన బాలీవుడ్ నటుడు

  • June 22, 2017 / 02:01 PM IST

“ఎన్టీఆర్ హార్డ్ వర్కర్, ఆయన స్టార్ హీరో అయినప్పటికీ ఒద్దికగా ఉంటారు. అతనికి సాటెవ్వరూ లేరు” అని  బాలీవుడ్ నటుడు రోనిత్‌ రాయ్‌ చెప్పారు. “ఎన్టీఆర్ సినిమాలో నటిస్తుండడం నాకు ఆనందంగా ఉంది. విద్యార్థిగా ఇక్కడ షూటింగ్ లో పాల్గొన్నాను. ఎంతో నేర్చుకోవాలి” అని ట్వీట్ చేశారు. బాబీ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ‘జైలవకుశ’ చిత్రంలో విలన్ గా రోనిత్‌ రాయ్‌ ఖరారు కాగానే తారక్ ఫ్యాన్స్  అతని ఘన స్వాగతం పలికారు. దీంతో ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు చెప్పారు. గురువారం ‘జై లవకుశ’ చిత్ర బృందాన్ని కలిసిన రోనిత్‌  అనంతరం  రామోజీ ఫిలిం సిటీలో 2 కోట్లతో వేసిన భారీ సెట్ లో జరుగుతున్న షూటింగ్‌లో పాల్గొన్నారు.

ఈ చిత్రంలో విలన్‌గా మొదట కన్నడ నటుడు దునియా విజయ్‌ని ఎంపిక చేయాలని భావించినా, కన్నడ పరిశ్రమ నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా అతన్ని పక్కన పెట్టారు. ఆ పాత్ర రోనిత్‌ కి దక్కింది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో తారక్ సరసన రాశీఖన్నా, నివేదా థామస్, నందితా రాజ్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఎన్టీఆర్ తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ కి థియేటర్లోకి రానుండగా.. జులై మొదటి వీక్ లో టీజర్ రిలీజ్ కానుంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus