షూటింగ్ ఆపేసి పార్టీ చేసుకుంటున్నాడు..!

  • December 24, 2018 / 09:56 AM IST

‘బాహుబలి’ చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి. ఒక్క సారిగా టాలీవుడ్ వైపు అందరినీ ఆకర్షితులను చేసాడు. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ జూ. ఎన్టీఆర్ లతో ‘ఆర్.ఆర్.ఆర్’ అనే భారీ మల్టీస్టారర్ ను తెరకెక్కిస్తూ బిజీ గా ఉన్న సంగతి తెలిసందే. అయితే రాజమౌళి ప్రస్తుతం ‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ ని ఆపేసినట్టు తెలుస్తోంది. ‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ ని ఆపేయడమేంటి..? అని కంగారు పడకండి. రాజమౌళి తనయుడు కార్తికేయ వివాహం కోసం కొన్ని రోజులు విరామం ఇచ్చాడు అంతే. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసి ఈ సినిమా రెండో షెడ్యూల్ ను సంక్రాంతి తర్వాత స్టార్ట్ చేయడానికి గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. ఇదిలా ఉండగా తనయుడు కార్తికేయ వివాహం డిసెంబర్ 27 న జైపూర్లో జరగబోతున్న సంగతి తెలిసిందే. జగపతి బాబు అన్నయ్య కూతురైన పూజా ప్రసాద్ తో కార్తికేయ వివాహం జరుగబోతోంది.

ఈ నేపథ్యంలో.. ఇటీవల రాజమౌళి కొందరి సెలబ్రిటీలకు ప్రీ వెడ్డింగ్ పార్టీ ఇచ్చాడని టాక్. ఈ పార్టీకి దాదాపు టాలీవుడ్ స్టార్స్ అందరూ హాజరయ్యారట. వివరాల్లోకి వెళితే మహేష్ బాబు.. ఎన్టీఆర్.. రాంచరణ్ లు ఈ పార్టీ లో సందడి చేశారని సమాచారం. అంతేకాదు ఈ పార్టీకి పలువురు బాలీవుడ్ సెలెబ్రిటీలు కూడా హాజరయినట్టు తెలుస్తుంది. పెళ్ళికి కుటుంబ సభ్యులు.. స్నేహితులు మాత్రమే హాజరయ్యేలా ఒక ప్రైవేటుగా జరపాలని రాజమౌళి ప్లాన్ చేసుకున్నాడట. అందుకే ఇలా ఇండస్ట్రీ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా ఒక పార్టీ ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus