రామ్ చరణ్, రామారావు, రాజమౌళి కాంబినేషన్లో సినిమాపై అధికారిక ప్రకటన.!

ఒకే ఒక్క ఫోటో. అటు నందమూరి అభిమానుల్ని.. ఇటు మెగా ఫ్యాన్స్ ని కొన్ని రోజులుగా నిద్ర లేకుండా చేస్తోంది. ఫ్యాన్స్ కి మాత్రమే కాదు.. తెలుగు చిత్ర పరిశ్రమ మొత్తాన్ని ఆ ఫోటో సస్పెన్స్ లో పడేసింది.  అదే రాజమౌళి తో ఎన్టీఆర్, చరణ్ కలిసి ఉన్న ఫోటో. 2017 నవంబర్ 18 న జక్కన్న ఈ  ఫోటోని షేర్ చేయడం అనేక ప్రశ్నలకు అవకాశమిచ్చింది. బాహుబలి తర్వాత రాజమౌళి చేయనున్న సినిమా కథ ఒకే అయిందా? మెగా, నందమూరి హీరోలతో మల్టీ స్టారర్ మూవీ చేయనున్నారా? అందుకు హీరోలు ఒప్పుకున్నారా?

ఒప్పుకుంటే ఆ చిత్రం ఎప్పుడు మొదలుకాబోతోంది?… ఇలా అనేక ప్రశ్నలు ఫిలిం నగర్లో కొన్ని రోజులుగా చక్కర్లు కొట్టాయి. ఈ ప్రశ్నలకు ఈరోజు సమాధానం చెప్పారు. మ్యాసివ్ మల్టీ స్టారర్ మూవీ గురించి అధికారిక ప్రకటన చేశారు. తాను బాహుబలి తర్వాత రామ్ చరణ్, రామారావులతో మల్టీ స్టారర్ మూవీ చేయబోతున్నట్టు వెల్లడించారు. దీంతో సస్పెన్స్ కి  తెరపడింది. మెగా, నందమూరి అభిమానులు ఆనందపడుతున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై దానయ్య నిర్మించనున్న మూవీకి ఇంకా పేరు ఫిక్స్ చేయకపోవడంతో.. ఈ ప్రాజక్ట్ కి #RRR అనే పేరు పెట్టారు. ఈ పేరుతో అఫీషియల్ అకౌంట్ ఓపెన్ చేశారు. ఈ సినిమా గురించి అప్డేట్స్ ఈ వేదికపై వెల్లడించనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus